Tuesday, May 7, 2024

అనురాగ్ ఠాకూర్‌పై ఇసి నిషేధం

- Advertisement -
- Advertisement -
anurag-thakur
72 గంటలు ఎన్నికల ప్రచారానికి దూరం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఎన్నికల సంఘం (ఇసి) గురువారం నిషేధం విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన రెచ్చగొట్టే నినాదాలిచ్చారనే ఆరోపణపై ఇసి ఈ చర్య తీసుకుంది. మరో బిజెపి నాయకుడు పర్వేష్ వర్మ కూడా దేశ రాజధాని ఢిల్లీలో 96 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధించింది. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వీరిద్దరూ బిజెపి స్టార్ క్యాంపెయినర్లు. వారిని ప్రచారానికి అనుమతించాలని పార్టీ కోరడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలప్రకారం వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. కానీ గురువారం మధ్యాహ్నం పరిస్థితి మారింది. కానీ వారి ప్రకటనలు మతపరంగా రెచ్చగొట్టేవిధంగా, విభజన ధోరణిలో ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపించడంతో ఇసి వారిపై నిషేధం విధించాలని నిర్ణయించింది.

EC bans Anurag Thakur for 72 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News