Monday, September 22, 2025

ప్లాన్ బీ అవసరమే!

- Advertisement -
- Advertisement -

ఇంజనీరింగ్ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్‌కు ట్రంప్ బ్రేక్

తెలుగు రాష్ట్రాల యువత అమెరికా కలలపై తీవ్ర ప్రభావం
మనతెలంగాణ/హైదరాబాద్: చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రీమ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ జాబ్. అమెరికాలో ఐటి రంగంలో ఉద్యోగం పొందేందుకు అనుగుణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అమెరికాలో ఉద్యోగం చేసి డాలర్లు సంపాదించాలనే లక్షలాది మంది భారతీయుల ఆశలపై, ముఖ్యంగా తెలుగు యువత కలలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం నీళ్లు చల్లింది. హెచ్1 బి వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేయనుంది. తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులు ప్రధానంగా మంచి ప్యాకేజీతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందడం లేదా అమెరికా వెళ్లి యుఎస్ చేయాలనే ప్రణాళికతోనే ఉంటారు.

అమెరికా కొత్త రూల్ ప్రస్తుతం వీసా ఉన్నవారికి, రెన్యూవల్ ప్రక్రియలకు వర్తించదు, కేవలం తాజాగా దరఖాస్తు చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని అమెరికా చెప్పినప్పటికీ భవిష్యత్తులో వీసా విధానాలలో మరిన్ని మార్పులు రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కూడా రావచ్చేమో అని పలువురు అంచనా వేస్తున్నారు. అమెరికా సహా ఇతర దేశాలలో మారుతున్న విధానాలతో మనదేశంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులను అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇప్పుడే ప్లాన్ బీ గురించి ఆలోచించి అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి హెచ్ 1 బి వీసాలను ఒక మార్గంగా ఉపయోగించుకునేవి.

అయితే, తాజా నిబంధనల ప్రకారం కంపెనీలు కేవలం లక్ష డాలర్ల ఫీజు చెల్లించడమే కాకుండా, ఆ ఉద్యోగికి ఏటా కనీసం 1.50లక్షల డాలర్ల వేతనం ఇవ్వా ల్సి ఉంటుంది. గతంలో సగటున లక్ష డాలర్ల వార్షిక వేతనం ఇస్తుండగా, ఇప్పుడు ఫీజుకే అంత మొత్తం చెల్లించాల్సి రావడంతో కంపెనీలు విదేశీయులను నియమించుకోవడానికి వెనకడుగు వేసే అవకాశం ఉంది. ప్రతి ఏటా అమెరికా జారీ చేసే 85 వేల హెచ్1-బి వీసాల్లో సుమారు 73 శాతం, అంటే దాదాపు 62 వేల వీసాలను భారతీయు లే దక్కించుకుంటున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెం దిన వారి సంఖ్య 35 వేల వరకు ఉంటుందని అంచనా. అమెరికా సర్కార్ తాజా నిర్ణయంతో వీరి అమెరికా ప్ర యాణం దాదాపు అసాధ్యంగా మారనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగా అనుకున్నట్లు జరగకపోతే ప్లాన్ బీని సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచించారు.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై ప్రభావం
ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ప్రధానం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌నే ప్రామాణికంగా పరిగణిస్తుంటారు. టాప్ కంపెనీలు భారీ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించే కా లేజీల్లో ప్రవేశాలు పొందడానికే ఆసక్తి కనబరుస్తారు. హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ని ర్ణయం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌పై కూడా ప్రభావం చూపే అ వకాశం ఉన్నది. ఎక్కువగా అమెరికా సహా ఇతర విదేశీ కంపెనీలు భారీ ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో వి ద్యార్థుల నైపుణ్యాల ఆధారంగా ప్యాకేజీలు ఇస్తాయి.

అధిక భారం వీసాలు టెక్ దిగ్గజాలదే
2024 ఆర్థిక సంవత్సరంలో జారీ చేసిన హెచ్1బి వీసాల్లో 64 శాతం కంప్యూటర్ సంబంధిత రంగాలకే దక్కాయి. ఈ విషయాన్ని యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సర్వే రంగాలు 10 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో స్థానంలో 6 శాతం వీసాలతో విద్యా సంబంధితమైనవి ఉన్నాయి. కంప్యూటర్ రంగంలో కస్టమ్ ప్రోగ్రామింగ్ రంగానికే అత్యధికంగా 25 శాతం వీసాలు లభించాయి. అమెరికా టెక్ దిగ్గజాలు అధిక భాగం వీసాలను దక్కించుకున్నాయి. యుఎస్‌సిఐఎస్ డాటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధికంగా 9000, గూగుల్ 5364, మెటా 4844, మైక్రోసాఫ్ట్ 4725, యాపిల్ 3873 వీసాలను స్పాన్సర్ చేశాయి.

Also Read: నా కుటుంబ నుంచి నన్ను దూరం చేసిన వాళ్లని వదలను: కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News