Sunday, April 28, 2024

రైతు బంధు వద్దు అన్న ఈటెల కావాలా?…. టిఆర్ఎస్ కావాలా?…

- Advertisement -
- Advertisement -

టిఆర్ఎస్ లో రోజు రోజుకు పెరుగుతున్న చేరికలు

టిఆర్ఎస్ లో చేరిన జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన యువ చైతన్య సంఘం యువత

టిఆర్ఎస్ లో చేరిన ఇల్లందకుంట వంతడుపుల గ్రామానికి‌ చెందిన వాల్మికీ బోయ సంఘం నేతలు, కార్యకర్తలు

అనంతరం టిఆర్ఎస్ లో చేరిన జమ్మికుంట ‌మండలం నాగం గ్రామస్థులు

కరీంనగర్: హుజూరాబాద్ లో అసలు బిజెపి వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా? అని నిలదీశారు. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా? మండిపడ్డారు. గత ఏడాది వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ కిరాయి ఎకరానికి 3 వేలు ఉంటే, నేడు ‌ఎకరానికి ఐదు వేలు అడుగుతున్నారని,  డిజీల్ ధర అరవై రూపాయల నుండి‌ నూటా ఆరు రూపాయల కు పెంచి రైతుల నడ్డి విరిచినందుకు బిజెపోళ్లు రైతులను ఓట్లు అడుగుతారా? చురకలంటించారు.

సిఎం కెసిఆర్ ఐదు వేలు రైతుబంధు కింద రైతులకు ఇస్తే డిజీల్ ధరలు పెంచి బిజెపి ప్రభుత్వం 2500 రూపాయలు ఇంకో చెత్తో తీసుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగాలు ఊడగొడుతుందని, మళ్లీ సోషల్ మీడియా లో తాము ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి సంక్షేమ శాఖ పెట్టమని కోరితే ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేందుకు డిజిన్విస్టమెంట్ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రక్రియ బిజెపి ప్రభుత్వం చేపడుతోందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆర్టిసి వంటి సంస్థలకు మూడు వేల కోోట్లు ఇచ్చి ఉద్యోగులను కాపాడుకుంటూ ఉందని హరీష్ రావు తెలియజేశారు.

ఇప్పటికే లక్షా 30 వేల‌ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో మరో 50 నుు చి 60‌వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి అని, గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం చేకూరుతుందన్నారు. హుజూరాబాద్ లో అభివృద్ధి కుంటుపడుతుందని, వ్యక్తి ప్రయోజనమా?, హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా అనే చర్చ జరగాలన్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు పరిగ ఏరుకున్నట్లు అవసరం లేదని బిజెపోళ్లు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ లో ఓట్లు అడిగే ముందు కళ్యాణ లక్ష్మి, రైతు బంధుపై బిజెపి వైఖరి ప్రకటించాలన్నారు. రైతుబంధు దండగ అనే బిజెపి నేత ఈటల రాజేందర్ కావాలా? టిఆర్ఎస్ కావాలా అన్న చర్చ పెట్టాలన్నారు.  గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను ఈటల రాజేందర్ పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. అందుకే ప్రజలు సిఎం కెసిఆర్ ని గుండెల్లో పెట్టుకుని, బిజెపి వాళ్లు ఇచ్చే ఆ గడియారాలను పగుల‌గొడుతున్నారని, టిఆర్ఎస్ గెలుపు పక్కా అని భారీ మెజారిటీతో గెలుపుకు కృషి‌ చెద్దామని పిలుపునిచ్చారు. రానున్ను రోజుల్లో పార్టీలో మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను‌ ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News