Wednesday, May 1, 2024

దేశంలోనే ఆశావర్కర్లకు ఎక్కవ వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: దేశంలోనే అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారని ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్తగా ఎంపికైన 1560 మంది ఆశా వర్కర్లకు నియామక పత్రాలు మంత్రి హరీశ్‌రావు హాజరై హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలతో కలిసి ఆశా వర్కర్లకు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశావర్కర్లు తెలంగాణలోనే ఉన్నారన్నారు. ఆశా వర్కర్లకు మొబైల్ బిల్లులను ప్రభుత్వమే భరిస్తున్నదన్నారు.

ఒకప్పుడు ఏ రోగం వచ్చిన గాంధీ, ఉస్మానియా దవాఖానాలకు వెళ్లేవాళ్లమన్నారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారన్నారు. దీంతో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో ఓపి శాతం తగ్గిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కెసిఆర్ కిట్‌తో మాతా శిశు మరణాలు తగ్గించామన్నారు. పైసా ఖర్చు లేకుండా టీ డయాగ్నోస్టిక్‌లో ఉచితంగా 134 పరీక్షలు చేస్తున్నామన్నారు. ఆశావర్కర్ల సేవలు మరచిపోలేనివని తెలంగాణలోని ఆరోగ్య సేవలు దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ దవాఖానాల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్ల సేవలు విశేషమైనవన్నారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లకు 9,750 వేతనం ఇస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్, ఆరోగ్యశాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు వైద్యంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. వైద్య రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నరన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీరవ్చదిద్దటం జరిగిందన్నారు. మెరుగైన వైద్యం కోసం అన్ని హంగులతో సకల సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 26 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News