Friday, April 26, 2024

సిద్దిపేటలో రైల్వే ట్రాక్ పనులను పరిశీలించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట : సిద్ధిపేట-రంగదాంపల్లి రైల్వే స్టేషన్, దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ దాదాపు 10కిలో మీటర్ల మేర జరుగుతున్న రైల్వే ట్రాక్ లైను పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికార యంత్రాంగం ఉంది. మార్చిలోపు సిద్ధిపేటలో రైలు కూత వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు.

దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం జరగొద్దని, పనుల వేగం పెంచాలని రైల్వే శాఖ అధికార యంత్రాంగం, కాంట్రాక్టర్ క సూచించారు. దుద్దెడ-సిద్ధిపేట వరకూ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులలో భాగంగా కేవలం 5కిలోమీటర్ల మేర ట్రాక్ చేపట్టాల్సి ఉన్నదని మంత్రికి రైల్వే శాఖ అధికారులు వివరించారు. సిద్ధిపేట-రంగదాంపల్లి రైల్వే స్టేషన్ పనులు మందకొడిగా సాగుతున్న దరిమిలా రైల్వే శాఖపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. దుద్దెడ-సిద్ధిపేట రైల్వే ట్రాక్ పనులలో మందపల్లి వద్ద అండర్ పాస్, కుకునూరుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై ఆరా తీశారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. శ్రీ కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో స్టేషన్ నిర్మాణం విషయంలో రైల్వే శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ తో మంత్రి సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News