Sunday, April 28, 2024

కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్

- Advertisement -
- Advertisement -

Harish rao

 

హైదరాబాద్: బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్‌పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్‌పై రెండో రోజు చర్చ సందర్భంగా హరీష్ మాట్లాడారు. కాంగ్రెస్ పద్దుల పార్టీగా మారిందని, అందుకే ఆ పార్టీని ప్రజలు రద్దు చేశారని వ్యంగాస్త్రాలు సంధించారు. అన్ని ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్న కాంగ్రెస్ వాళ్లలో మార్పు రావడం లేదని ఎద్దేవా చేశారు. మాంద్యం ఉన్నా సంక్షేమానికి రూపాయి కూడా తగ్గించొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారన్నారు. సంక్షేమానికి నిధులు పెంచినందుకైనా ప్రతిపక్షాలు అభినందిస్తాయనుకుంటే వాళ్లకు ఆ మాత్రం కూడా నోరు రాలేదన్నారు.

కొత్త కార్యక్రమాలను కూడా వారు స్వాగతించలేకపోయారని, హైదరాబాద్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, అందుకే కెసిఆర్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తుందన్నారు. రైతులను బలోపేతం చేసేందుకు రైతుబంధు సమితులను ఏర్పాటు చేస్తున్నామని, 150 కిలో మీటర్ల జీవనదిగా మారిన గోదావరి దేశాన్ని ఆకర్షిస్తున్నదని హరీష్ తెలియజేశారు. సుస్థిరాభివృద్ధి పెట్టుబడి వ్యయంతో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్కకు కనపడడం లేదా? అని హరీష్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో కాంగ్రెస్ పెన్షన్ కోసం 5558 కోట్లు ఖర్చు చేస్తే… ఐదున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.42,470 కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. విజయడైరీని మూసివేసేందుకు ఆంధ్రపాలకులు కుట్రలు చేశారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక విజయ డైరీని లాభాల బాట పట్టించామని కొనియాడారు.

విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టించామని, కనురెప్ప కొట్టినంత సేపు కూడా కరెంట్ పోకుండా చేశామని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య అందిస్తున్న మొదటి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పెదింటి ఆడబిడ్డ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, అదే కెసిఆర్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డకు పెళ్లికి లక్షా 116 ఇస్తున్నామని, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల మంది సాయం చేశామన్నారు.

Harish Rao speech on Telangana budget

 

Harish Rao speech on Telangana budget
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News