Saturday, April 27, 2024

పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టి శ్రేణులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి.. రైతు శ్రేయస్సే టిఆర్ఎస్ ప్రభుత్వ ద్యేయం. రైతు రాబందుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అన్ని అమ్ముతున్న కేంద్రం, తెలంగాణ రైతులు పండించిన వరిని మాత్రం కొనడం లేదు. రైతు ఆరుగాలం కష్ట పడి పంట వేసి పండించిన వరి ధాన్యాన్ని కొంటారా.. కొనరా అని సిఎం కెసిఆర్ సూటిగా అడిగితే నేటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు రైతు పెట్టు బడి సాయం రైతు బంధు, రైతు బీమా, ఎరువుల విత్తనాలు ఇస్తున్నాం. కాళేశ్వరం ద్వారా నీళ్లు, 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాలంతో సంబందం లేకుండా ప్రతి పల్లెలో చెరువులన్ని జల కళతో నిండి ఉన్నాయి. ఇది సిఎం కెసిఆర్ కు రైతుల పట్ల ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం.

తెలంగాణ ప్రాంతంలోని రైతులు, వారు పండించే పంటల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసిన వైఖరి అవలంభిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. తెలంగాణలో రైతులు పండించేది బాయిల్ రైస్ అని అంటోంది. పంజాబ్ లో ఒక విధానం తెలంగాణకు ఒక విధానమా?.. భారత రాజ్యాంగం నిర్దేశించినట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తమతమ విధులు నిర్వహించాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా రైతులకు నిరంతరయంగా నీళ్లు, కరెంటు ఇస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత అయిన ధాన్యం సేకరణను విస్మరిస్తూ తెలంగాణ రైతులను మోసం చేస్తుంది. యాసంగికి ఇంకా విధానాలు ప్రకటించలేదు. వానాకాలంలో కొంటాం అన్న పంటను కొనకుండా తత్సర్యం చేస్తుంది.

వరి పంటను కేంద్రం కొనకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సిఎం కెసిఆర్ రాష్ట్రమంతట ఈ నెల 20న పల్లె పల్లెనా రైతు ధర్నా కార్యక్రమాన్ని చెప్పట్టారు. కెసిఆర్ పిలుపు మేరకు ప్రతి గ్రామంలో రైతు ధర్నా, కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం చేయాలి. గత నెలలో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చెపెట్టినం.. మన ఎంపీలు పార్లమెంటులో బెటాయించారు. ఎంపీలు, మంత్రుల బృందం, సీఎం కేసీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలసినా ఎలాంటి స్పందన లేదు. కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరిని కొనం అని వ్యతిరేకంగా ఉంది. దాన్ని మనం గట్టిగా రైతుల పక్షాన నిలబడి తెలంగాణ రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత మనంపై ఉంది. కేంద్రం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించాలి. ఈ ధర్నాలో రైతులు, పార్టీ శ్రేణులు రైతు బంధు సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం వరిని కొనదని గట్టిగా చెప్పాలి” అని పేర్కొన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్, సూడా చైర్మన్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, డైరెక్టర్లు, కో ఆపరేట్ చైర్మన్ లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, రైతు బంధు మండల, గ్రామ శాఖ కో ఆర్డినెటర్స్, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Harish Rao Teleconference with Public representatives

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News