Monday, April 29, 2024

వంద రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి:  పటాన్ చెరులోని రుద్రారం గ్రామ పరిధిలో గణేష్ గడ్డకు మనకు అచ్చొచ్చిన స్థలమని ఎంపి గెలుపు పక్కా అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మెదక్ పార్లమెంటులో 2004 నుండి 2024 వరకు బిఆర్ఎస్ పార్టీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ పాల పొంగు లెక్క అయ్యిందని, హామీలు ఇచ్చి కాంగ్రెస్ మొత్తం మరిచి పోయిందని, హామీలు అమలు చేయక ముఖం చాటేసిందని, ప్రభుత్వం వచ్చి 125 రోజులు అయినా రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) సమీపంలో భారత రాష్ట్ర సమితి మెదక్ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను రాష్ట్ర మాజీ మంత్రి, శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు, పటాన్ చెరు శాసన సభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాలో మాట్లాడారు.

పదివేల రూపాయలు మా అక్కా చెల్లలకు చెల్లించాకే కాంగ్రెస్ ఓటు హక్కు అడగాలని, పింఛన్లు ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారని, నిరుద్యోగ భృతి మీద రోజుకో మాట మాట్లాడుతున్నారని,  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని దుయ్యబట్టారు. రైతులకు హామీలు ఇచ్చి మోసం చేశారని, అభయహస్తం అక్కరకు రాని హస్తం అయ్యిందని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కిట్టు బంద్ అయ్యిందని, తిట్లు వచ్చాయని, వరికి 500 బోనస్ ఇవ్వలేదు అని అడిగారు. 15 వేల బోనస్ ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని, భాష, సంస్కారం ఉండాలి కదా అని,  వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు చనిపోయారని, ఫేక్ వార్తలతో ఎన్నో రోజులు ఉండరని, మీలాంటి వారికి గుణపాఠం తప్పదని హరీష్ రావు హెచ్చరించారు.  మొన్నటి ఎన్నికల్లో 38 వేల ఓట్ల మెజార్టీతో మహిపాల్ రెడ్డిని గెలిపించారని, పటాన్ చెరులో ఉంటారని, రేపు ఎంపిగా వెంకట్రామిరెడ్డి ఉమ్మడి మెదక్ కు సేవలు అందిస్తారని చెప్పారు.

గల్లీ గల్లి తెలిసిన వ్యక్తి వెంకటామ్రిరెడ్డి అని, పార్లమెంట్ లో తెలంగాణ గళం విప్పుతాడని,  ఎంతో మందికి సాయం చేశారని, వంద కోట్లతో విద్యా నిధి ఏర్పాటు చేశారని,  బిజెపి నేత రఘునందన్ మంచిగా పని చేస్తే దుబ్బాకలో ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదని,  అందుకే రఘునందన్ ను 54 వేల ఓట్లతో ఓడించారని ఎద్దేవా చేశారు. వెంకట్రామి రెడ్డి అధికారికంగా అద్భుతమైన సేవలు అందించారని, పని చేసే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని హరీష్ రావు ప్రశంసించారు.
పటాన్ చెరు అభివృద్ధికి గళం విప్పుతారని, గళం ఎత్తేవారు కావాలా? గులాం గిరీ చేసే వారు కావాలా? అని అడిగారు. భవిష్యత్తులో అధికారం లోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని,  ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News