Monday, April 29, 2024

ఆ ప్లానింగ్ తోనే బ్యాటింగ్ చేశా: నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ తోనే బ్యాటర్లు, బౌలర్స్ వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, తిలక్ వర్మ బ్యాటర్లు బ్యాటింగ్ లో అదరగొట్టడంతో టీమిండియా జట్టులోకి వచ్చారు.  సన్ రైజర్స్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అల్ రౌండర్ ప్రదర్శన చేయడంతో పంజాబ్ కింగ్ పై ఎస్ఆర్ హెచ్ ఘన విజయం సాధించింది. 37 బంతుల్లో 64 పరుగులు చేయడంతో ఒక వికెట్ తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సన్ రైజర్స్ గత సంవత్సరం ఐపిఎల్ లో రూ.20 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది.

ఐపిఎల్ 2023 లొ ఆర్ సిబి మ్యాచ్ లో ఆరంగ్రటం చేశాడు, బ్యాటింగ్ చేసే అవకాశాలు రాకపోవడంతో మూడు మ్యాచ్ లు ఆడి 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 11 మందిలో ఇప్పుడు ప్లేయర్ గా ఉండడంతో ఆడే ఛాన్స్ వచ్చింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకంగా మారాడు. నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తనపై తాను నమ్మకం ఉంచుకోవడంతో పాటు బాగా ఆడాలని లోలోపలే ప్రతీసారి మాట్లాడుకుంటున్నానని వివరణ ఇచ్చాడు. జట్టును గెలిపించడంతో సఫలమయ్యానని, పాస్ట్ బౌలింగ్ లో ఆచితూచి బ్యాటింగ్ చేసి స్పిన్ బౌలింగ్ లో ధాటిగా ఆడానని వివరణ ఇచ్చాడు. నెక్ట్స్ మ్యాచ్ లలో బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తానని ఆశాభావం వ్యక్తం శాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News