Tuesday, April 30, 2024

హరితహారంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Harithaharam: more trees are plant in telangana

హైదరాబాద్: ఈ సారి హరితహారాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందకు ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. శంషాబాద్‌లోని హెచ్‌ఎండిఎ నర్సరీని మంత్రి కెటిఆర్ సందర్శించారు. హెచ్‌ఎండిఎ నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించిన సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడంతో పాటు మొక్కల పెంపకంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పరిధిలో ఎవరైనా మొక్కలు కావాలనుకుంటే నగర పరిధిలోని నర్సరీల్లో నుంచి ఉచితంగా తీసుకోవచ్చన్నారు. నగరంలోని నర్సరీల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామని, భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కెటిఆర్ తెలియజేశారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News