Friday, May 10, 2024

విద్యుత్ శాఖలో బదిలీ కోసం పైరవీలు

- Advertisement -
- Advertisement -
Piracy for transfer in TS power department
కోరుకున్న స్థానం కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టు ప్రదక్షిణలు

హైదరాబాద్: విద్యుత్ సంస్థలో ఉద్యోగులు బదిలీల కోసం ఉత్తర్వులు జారీ కా వడంతో ఎస్‌పిడీసీఎల్ యాజమాన్యం బదిలీల పై దృష్టి సారించింది. జనరల్ బదిలీల్లో వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన వారితో పాటు మూ డు సంవత్సరాలు ఒకే చోట పని చేస్తున్న వారిని బదిలీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు సిద్ధం చేస్తోంది. 20విద్యుత్ సంస్థ ఎస్‌ఎస్‌డీసీఎల్ పరిధిలో బదిలీలకు 26 మంది డీఈలు,87 మంది ఏడీఈలు 243 మంది ఏఏఈ, ఏఈలు అ ర్భులుగా గుర్తించి జాబితాను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని నాలుగు సర్కిళ్ళలో హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్, బం జారాహిల్స్,సికింద్రాబాద్ సర్కిళ్ళు అదే విధం గా రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ ఉన్నాయి.

19 డివిజన్లు, 50 సబ్ డివిజన్లు, 180 సెక్షన్లు ఉన్నాయి. డివిజన్ కు డీఈ, సబ్ డివిజన్‌కు ఏడీఈ, సెక్షన్‌కు ఏఈ అధికారులు వుంటారు. రంగారెడ్డిలో జిల్లాలోని సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్‌సిటీల ఉన్నా యి. శివారు ప్రాంతంలోని 9 డివిజన్లకు ఎనలే ని డిమాండ్ ఉంది. ముఖ్యంగా బోడుప్పల్, రా జేంద్రనగర్, శేర్‌లింగంపల్లి,ఎల్బీనగర్,కొండాపూర్, తదితర ప్రాంతాలు విద్యుత్ అధికారుల కు ఆదాయ పరంగా డిమాండ్ ఉంది. అంతే కా కుండా రంగారెడ్డి జిల్లాలో నార్త్,ఈస్త్,సౌత్ జోన్ లు ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ జోన్ పరిధిలో హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, గచ్చిబౌలీ తదితర ప్రాంతాలను నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సిఎం కెసిఆర్ ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు, భారీ ఎత్తున నిర్మాణాలు కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి.

ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు నగర ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. విద్యుత్ అధికారులు సైతం ఈ ప్రాంతంలో పోస్టింగ్ వేయించుకునేందుకు ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఈ ప్రాంతంలో విద్యుత్ అధిక డి మాండ్ ఉండటంతో పాటు వారికి కూడా ఆదా యం బానే వస్తుంది.దీంతో వారు ఈ ప్రాంతానికి పోస్టింగ్ వేయించుకునేందుకు వారు ఎంతో ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బది లీ చేయించుకునేందుకు వారు ఎవరికి తగ్గ స్థా యిలు వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారని సమాచారం. కొందరు అధికారులు తమకు ఎంతో సన్నిహితంగా ఉండే ఉన్నతాధికారులతో తమ ప్రయత్నాలు చేస్తుండగా,మరొ కొందరు తమకు ఎంతో పరిచయం ఉన్న ఎమ్మెల్యే లు, మంత్రులు చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. వీరి ప్రదక్షణలో విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులుపై ఒత్తిడి తీవ్రం అవుతోంది. అంతే కాదు ఆయా ప్రాంతాలకు తమను బదిలీ చేయించుకునేందుకు పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు సైతం ఉన్నతాధికారులను ప్రలోభ పెడుతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News