Monday, April 29, 2024

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 3కు విచారణ వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3కు విచారణను ఎపి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇటీవల దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎపి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించగా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వర్చువల్ విధానంలో వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సిఐడి కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు పాత్ర లేదని సిద్దార్థ్ లూధ్రా హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఇక ఎజి శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ రింగ్ రోడ్ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు ఉన్నాయని, మాస్టర్ ప్లాన్ తర్వాత లింగమనేనికి లబ్ధి చేకూరిందని అన్నారు. లింగమనేని, హెరిటేజ్ సంస్థలు భూఆక్రమణలకు పాల్పడ్డాయని వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణ అక్టోబర్ 3కు వాయిదా వేడింది. అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా శుక్రవారం విచారణ జరగ్గా అక్టోబర్ 4వ తేదీకి తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News