Sunday, April 28, 2024

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని సింగరేణి ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా సింగరేణి అంగడి బజారులో వినియోగదారులకు శనివారం సింగరేణి ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్ జ్యూట్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ గుడ్డ సంచులు వాడాలని, పర్యావరణ పరి రక్షణకు తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించాలని కోరారు. ప్లాస్టిక్ సంచుల వలన మానవులకే కాకుండా ప్రాణులకు కూ డా ప్రమాదం జరుగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి తమవంతు కృషి చేయాలని కోరారు.

ప్రతీ ఒక్కరూ కూడా నిత్యవసర వస్తువుల కొనుగోలుకు తమ వెంట జ్యూట్ బ్యాగ్‌లను తీసుకొని వెళ్లాలని, దీని ద్వారా ప్లాస్టిక్ బ్యాల విని యోగం తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో టిబిజికెఎస్ ఆర్జీ 1 ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, సిఎంఓఎఐ ప్రెసిడెంట్ పొనగోటి శ్రీనివాస్, ఎన్విరాన్‌మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పీవో బంగారు సారంగపాణి, ఇతర అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News