Thursday, May 2, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Heavy Rain in Telangana and AP For Next 2 Days

మనతెలంగాణ/హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు, గాలి కూడా బాగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి వరుసగా ఐదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి -50 కిలోమీటర్ల వేగంతో గాలులు రెండురోజుల పాటు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ చేపలు పట్టేందుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో వీచే గాలులు సముద్ర అలలుఉవ్వెత్తున ఎగసిపడేలా చేస్తాయని, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల పరిధిలో దట్టమైన మేఘాలు
దట్టమైన మేఘాలు తెలుగు రాష్ట్రాల పరిధిలో చురుకుగా వ్యాపించినట్టు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. దీనికితోడు పవనంలోనూ కదలికలు చురుగ్గా ఉన్నాయని వారు తెలిపారు.. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు రెండు రోజుల పాటు వీస్తాయని అధికారులు తెలిపారు.
నిర్మల్ 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం
ఇప్పటికే మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షం వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ 96.3 మిల్లీమీటర్ల వర్షపాతం, సంగారెడ్డి 74.3, వరంగల్ అర్భన్ రూరల్ 66, మంచిర్యాలలో 64.3, నాగర్‌కర్నూల్ 52, కామారెడ్డి 49.3, యాదాద్రి భువనగిరి 45, వికారాబాద్ 44, భద్రాద్రి కొత్తగూడెం 43, కొమురంభీం ఆసిఫాబాద్ 43, రాజన్న సిరిసిల్ల 41.5, మెదక్ 37, జనగాం మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rain in Telangana and AP For Next 2 Days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News