Friday, May 3, 2024

తెలంగాణలో రాబోయే 24గంటల్లో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

Heavy rains in Telangana in next 24 hours

హైదరాబాద్: అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు, ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైరదాబాద్ లో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. సోమ‌వారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బెంగాల్ మీదుగా విస్తరించింది. దీంతో ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహమూబాబాద్‌, ఖమ్మం జిల్లాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అటు ఎపిలోనూ అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడుతాయని ఎపి వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy rains in Telangana in next 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News