Friday, May 10, 2024

చినికు పడితే చాలు

- Advertisement -
- Advertisement -

Heavy Rains To Hit Across Telangana

చిగురుటాకుల వణుకుతున్న కాలనీ వాసులు
ముంపుకు అధికారుల అలసత్వమేనన్న ఆరోపణలు
గత ఏడాది ముంపుతో పాఠాలు నేర్వని అధికార గణం

హైదరాబాద్: నగరంలో చినుకు పడితే చాలు కాలనీల వాసులు చిగురుటాకుల వణకి పోతున్నారు. కాలం ప్రారంభంలోనే మొదటి వర్షాలకే నగరంలో పలు ప్రాంతాలు నీట మునుగడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. గత ఏడాది ఆక్టోబర్ 13 నుంచి 18వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే… అయితే ఈ సారి మాత్రం వర్ష కాలం ప్రారంభంలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో తిరిగి అవే ప్రాంతాలు మళ్లీ ముంపుకు గురువుతుండడంతో కాలనీ వాసులు అసహానం వ్యక్తం చేస్తున్నారు. మరో 4 రోజుల పాటు గ్రేటర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరింత భయాందోళనలకు గురువుతున్నారు.

గత ఏడాది సంభంవించిన వరదల నేపథ్యంలో ముంపు నివారణకు యుద్ద ప్రాతిపదికన చర్యల పేరుతో సమగ్ర నాలాల అభివృద్ది కార్యక్రమం(ఎన్‌ఎన్‌డిపి) పేరుతో ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటకి ఇటు బల్దియా, అటు ఎస్‌ఎన్‌డిపి గడిచిన 9 నెలల కాలంలో నాలాల అభివృద్ది ఏలాంటి చర్యలు చేపట్టక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే పరిస్థితి మరింత దారుణంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్‌లో ముంపు నివారణకు సంబంధించి నాలాల అభివృద్దికి ప్రభుత్వం ఇప్పటీకే రూ.848 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో నాలాలను పూర్తిగా అభివృద్ది చేసే బాధ్యతను ఎస్‌ఎన్‌డిపికి అప్పగించింది. అయితే అధికారులు మాత్రం ప్రణాళికల పేరుతో కాల యాపన చేయడం, చేపట్టిన అభివృద్ది పనులు సైతం నత్త నడకన సాగడడంతో నాలాల పూడిక తీతను సైతం పెద్దగా పట్టించుకోకపోవడం కారణంగా చిన్నపాటి వర్షానికి పలు ప్రాంతాలు ముంపుకు గురువుతున్నాయని పలువురు కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. అధికారులు అలసత్వం కారణంగా ప్రతి ఏటా వర్షకాలంలో కాలనీ వాసులు ముంపుకు గురికావాల్సి వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది సరూర్‌నగర్ చెరువు పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన ప్రతి కాలనీ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మళ్లీ వరద నీరు పొట్తేత్తడమే అధికారులు ఇప్పటీ వరకు ఏలాంటి పనులు చేపట్టలేదనే దానిని నిదర్శనమని పేర్కొంటున్నారు.

సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లుతున్న కుటుంబాలు..

ఎల్‌బినగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు ఖాళీ అవుతున్నాయి. తరుచు ఈ ప్రాంతంలో ని పలు కాలనీలు తరుచు ముంపుకు గురవుతుండడంతో కిరాయిదార్లు సురక్షిత ప్రాంతాలను వెతుకుంటున్నారు. ఎల్‌బినగర్, నాగోల్ ప్రాంతాలు గతంలో శివారు ప్రాంతాలైనప్పటీకి నగరానికి కూతవేటు దూరంలో ఉండడంమే కాకుండా మెట్రో రైలుకు కేంద్రంగా ఉన్నాయి. ఎల్‌బినగర్ నుంచి మియాపూర్ కారిడార్, నాగోల్ నుంచి హైటెక్ సిటీ కారిడార్ ప్రారంభం కావడంతో వీటి పరిసర ప్రాంతాలలో కాలనీల్లో పెద్ద ఎత్తున కిరాయిదార్లు ఉంటున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఇంటి యాజమానుల సంఖ్య కంటే అద్దెకుంటున్న వారి సంఖ్యే అధికం కావడం గమన్హారం. అయితే చినుకులు పడితే చాలు ఈ ప్రాంతం తరుచు ముంపుకు గురవుతుండడంతో అద్దెకు కుంటున్న వారు ఉన్నపల్లంగా ఇళ్లు ఖాళీచేసి వెళ్లుతున్నారు. దీంతో యాజమానులు తలలు పట్టుకుంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News