Friday, August 8, 2025

హిమాయత్‌సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తివేత… మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరిన నీటి మట్టం పెరగడంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. మూసీ పరీవాహక ప్రజలకు అధికారుల హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత రెండు రోజుల నుంచి జిహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షాలు కురువడంతో ముసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా సంగం భీమలింగం దగ్గర మూసీ లెవెల్‌ వంతెన పైనుంచి ప్రవహిస్తుంది. మూసీ నది వంతెనపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News