Sunday, May 5, 2024

చరిత్రకారుడు బాబాసాహెబ్ పురందరే కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Historian Babasaheb Purandare passed away

 

పూణె: బాబాసాహెబ్ పురందరేగా పేరున్న ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99) సోమవారం ఉదయం పూణెలోని ఓ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయణ్ని మూడు రోజుల క్రితం హాస్పిటల్‌లో చేర్చినట్టు సన్నిహితులు తెలిపారు. ఛత్రపతి శివాజీ చరిత్రపై 900 పేజీలతో రెండు భాగాలుగా ఆయన రాసిన గ్రంథం ‘రాజాశివఛత్రపతి’ ప్రముఖుల ప్రశంసలందుకున్నది. 2019లో ఆయణ్ని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే, పూణె మేయర్ మురళీధర్‌మొహోల్ సంతాపం తెలిపారు. పురందరేకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News