Tuesday, April 30, 2024

నోయిడాలో ఉత్పత్తి నిలిపేసిన హోండా

- Advertisement -
- Advertisement -

Honda stops production in Noida

 

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సిఐఎల్) యుపిలోని గ్రేటర్ నోయిడాలో ఉన్న తన ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపి వేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్‌లోని తపుకరలో ఉన్న ప్లాంట్‌లోనే జరగనుంది. నోయిడాలో కంపెనీ కార్పొరేట్ హెడ్ ఆఫీసుతో పాటు స్పేర్‌పార్ట్ డివిజన్,ఆర్‌అండ్‌డి కేంద్రం, ఇతర కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయి. జపాన్‌కు చెందిన హోండా దేవీయంగా కార్ల ఉత్పత్తి కోసం 1997లో నోయిడాలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. అయితే ప్లాంట్ ఉత్పత్తి సామర్థం పెంపునకు ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులకు విఆర్‌ఎస్ ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా ప్లాంట్‌ను మూసి వేయాలని నిర్ణయించింది. దీనిపై స్పందించేందుకు సంస్థ నిరాకరించింది. గ్రేటర్ నోయిడాలో హోండాకు చెందిన సిటీ, సిఆర్‌వి,సివిక్ మోడళ్లు ఉత్పత్తి అయ్యేవి. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థం ఏడాదికి లక్ష యూనిట్లు కాగా, తపుకరా ప్లాంట్ సామర్థం 1.8 లక్షల యూనిట్లుగా ఉంది. ఇతర దేశాలకు సైతం తపుకరలో తయారయ్యే ఇంజన్లు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు గత ఏడాది నవంబర్‌లో 6,594 యూనిట్లు మాత్రమే విక్రయించిన హోండా ఈ ఏడాది నవంబర్‌లో 9,900యూనిట్లు విక్రయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News