Sunday, April 28, 2024

డిజిపిగా మీరు ఎలా నియమించారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా నియమించిన మహేందర్ రెడ్డి అవినీతిపరుడైతే బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనను డిజిపిగా ఎలా నియమించారో బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎం ఎల్‌సి కవిత చెప్పాలని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై, పలువురు అధికారులపై ఎంఎల్‌సి కవిత చేసిన విమర్శలకు దీటుగా సమాధానమిచ్చారు. 36 ఏళ్ళ పాటు వివిధ హో దాల్లో పనిచేసిన మాజీ డిజిపి మహేందర్ రెడ్డి సీనియర్ అధికారి గు ర్తించి టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా ప్రభు త్వం నియమించిందని మంత్రి స్పష్టం చేశారు. నీ మాదిరిగా లిక్కర్ స్కాం, టిఎస్పిఎస్సీ ప్రశ్రాపత్రాలు లీక్ చేయలేదు కదా అని ఎంఎల్‌సి కవితను ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం సింగరేణిని ధ్వంసం చేసి నిధులను మెదక్, గజ్వేల్, సిరిసిల్లలకు తరలించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి అవినీతి కేసులో వాటా కలిగిన బిఆర్‌ఎస్ నాయకులకు సింగరేణి అవినీతిలో ఎంత వాటా ముట్టిందో కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వా న్ని విమర్శించే అర్హత కవితకు ఏనాడు లేదన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా కార్యదక్షత కలిగిన రజనీకాంత్ రెడ్డిని నియమిస్తే కవిత ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు గత తొమ్మిదిన్నరేళ్ళ మీ పరిపాలనను తిరిగి చూసుకొని, విశ్లేషించుకొని మాట్లాడాలని హితవు పలికారు. తరచూ మీడియాలో ఉండాలనే కోరికతో కాంగ్రెస్ పార్టీ మీద అబద్దపు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కి మరోసారి బుద్ది చెబుతారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ భగవద్గీతగా భా వించే మేనిఫెస్టోను అమలు చేసి తీరుతామని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News