Friday, May 3, 2024

ఆన్‌లైన్‌లో ఆలిని అమ్మకానికి పెట్టిన భర్త

- Advertisement -
- Advertisement -

Husband who put Wife up for sale online

 

కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రేమించి పెళ్లి చేసుకుని, ఆపై కట్టుకున్న భార్యను ఆన్లైన్ అమ్మకానికి పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో చోటుచేసుకుంది. ఆమ్మకానికే కాదు ఎవరికైనా కావాలంటే రోజులతో పాటు గంటల చొప్పున పంపిస్తామని సదరు భర్త ఆన్‌లైన్‌లో ఫోటోలు అప్లోడ్ చేశారు. ఈ విషయం భార్యకు తెలియడంతో భర్తపై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన రేవంత్ ఈ ఏడాది ఆగష్టు 23న తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమించి ఆపై వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోవడంతో బెంగళూరులో పెళ్లి చేసుకున్నారు.ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజుల పాటు సంసారం చేసిన రేవంత్ గత రెండు నెలలుగా భార్యను హింసించ సాగాడు.

తనకు కట్నం కావాలని కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న క్రమంలో సదరు యువతి బెంగళూరు నుంచి తిరుపతిలో తన పుట్టింటికి చేరుకుంది. తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకుని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని తిరుపతిలో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోయిన రేవంత్ తన భార్య ఫోటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ కావడంతో ఆమె షాక్ అయ్యింది. తనపై అసభ్య పోస్టులు పెట్టిన రేవంత్ తల్లిదండ్రులను నిలదీసేందుకు వెళ్లగా వారు కుటుంబ సభ్యులు ఇంటినుంచి పారిపోయారు. దీంతో బాధిత వివాహిత తిరుపతి పోలీసులను మరోసారి ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News