- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్‌లో గత గురువారం కురిసిన బారీ వర్షానికి హుస్సేన్‌సాగర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరం, శివారు ప్రాంతాల్లోని నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టిఎల్ హద్దును మించి నీటిమట్టం పెరగడంతో గేట్లు ఎత్తివేసి వరద నీటిని దిగువ ప్రాంతాలకు అధికారులు వదలుతున్నారు. హుస్సేన్‌సాగర్ నీటిమట్టం +513.41 మీ.లు. అయితే, నీటి మట్టం శుక్రవారం +513.63 మీ.లుగా ఉంది. గరిష్టంగా నీటి మట్టం +514.75 మీ.లు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదనీరు 1234 క్యూసెక్కులుగా ఉంటే.. దీనిని దృష్టిలోపెట్టుకున్న అధికారులు దిగువ ప్రాంతాలకు 1523 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. దీంతో హుస్సేన్‌సాగర్‌కు వరద నీటితో ఏలాంటి సమస్య రాదనేది అధికారుల ధీమాగా ఉంది.
- Advertisement -