Thursday, May 2, 2024

కరోనా మృతదేహాల మాయంపై విచారణకు సిపి అంజనీకుమార్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

CP Anjani kumar

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు మాయం కావడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ విచారణకు ఆదేశించారు. గతంలో బేగంపేటకు చెందిన వ్యక్తి కరోనాతో మృతిచెందగా వేరే వ్యక్తి మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకువెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులు గుర్తించి తమ వ్యక్తి కాదని సిబ్బందితో గొడవుకు దిగారు. దీంతో గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చి అసలు మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. ఆ మృతదేహం ఎవరిదో తెలియాల్సి ఉంది. ఇలా గుర్తుతెలియని మృతదేహాలను ఎలాంటి రిజిస్ట్రర్ నిర్వహించడంలేదు. దీంతో గాంధీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలు మారిపోవడం లేదా గుర్తించకపోవడం జరుగుతోంది. ధూల్‌పేటకు చెందిన నరేందర్ సింగ్ కరోనా లక్షణాలు కన్పించడంతో కోఠిలోని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రికి పంపించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న నరేందర్ సింగ్ తర్వాత ఇంటకి రాలేదు.

దీంతో అతడి సోదరుడు ముఖేష్ సింగ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా కూడా పోలీసులు ఆచూకీ కనిపెట్టలేకపోయారు. వెంటనే సోషల్ మీడియాలో తన తమ్ముడి ఆచూకీ తెలుసుకోండని వీడియో పెట్టడంతో పోలీసులు గాంధీ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. వారు మార్చురీలో ఉన్న గుర్తుతెలియని మృతదేహం నరేందర్ సింగ్‌దిగా గుర్తించి అప్పగించారు. ఉస్మానియాలో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరికి కరోనా ఉండగా, మరొకరు శ్వాస సంబంధ వ్యాధితో చికిత్స పొందుతోంది. ఇద్దరి పేర్లు ఉన్నీసా కావడంతో పోలీసులు, వైద్య సిబ్బంది అయోమయానికి గురయ్యారు. కరోనాతో మృతిచెందిన మహిళ కుటుంబానికి బదులు శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న కుటుంబానికి వైద్యులు సిబ్బంది, రేయిన్‌ బజార్ పోలీసులు ఫోన్ చేసి మృతిచెందినట్లు చెప్పారు. తమ చికిత్స పొందుతోందని ఎలా చనిపోతుందని అనడంతో వైద్య సిబ్బంది, పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే మృతిచెందిన మహిళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఆస్పత్రి సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చి తీవ్ర మానసిక వేదనకు గురిచేశారంటూ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hyd CP order to probe on missing Corona dead bodies

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News