Wednesday, May 15, 2024

ప్రారంభమై కొనసాగుతున్న గ్రేటర్ పోలింగ్

- Advertisement -
- Advertisement -

Hyderabad GHMC Elections 2020 live updates

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు జరగనుంది. 150 డివిజన్లకు గాను 9,101 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో 1752 హైపర్‌ సెన్సిటివ్‌, 2934 సెన్సిటివ్‌, 4415 నార్మల్‌ పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు 52,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలను శానిటైజ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Hyderabad GHMC Elections 2020 live updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News