Saturday, May 4, 2024

సెయిలింగ్ పోటీలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా మొత్తం 89 మంది భాగస్వామ్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన 37 హైదరాబాద్ సెయిలింగ్ వీక్- 2023, లేజర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ హుస్సేన్‌సాగర్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈనెల 9వ వరకు కొనసాగనున్న సెయిలింగ్ రెగట్టా నావికా పోటీలను మంగళవారం లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సిదానా ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించా రు. ఈ సందర్బంగా జెఎస్ సిదానా మాట్లాడు తూ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ హుస్సేన్ సాగ ర్ సరస్సు వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించబడే వార్షిక జాతీయ రెగట్టా అని దీనిని కొనసాగిస్తూ ఈ ఈవెంట్‌ను ఈ సారి నిర్వహిస్తున్నామన్నారు.

సెయిలింగ్ బోట్‌లకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులు అందరూ ఎదురుచూసే ఇటువంటి గొప్ప ఈవెంట్‌ను ప్లాన్ చేసినందుకు సెయిలింగ్ అసోసియేషన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనడానికి రాష్ట్ర యువతను ప్రోత్సహించిన తెలంగాణ స్పోర్ట్ అసోసియేషన్‌ను కూడా అభినందిస్తున్న ట్లు పేర్కొన్నారు. సెయిలింగ్ నావికులు వివిధ జాతీయ, అంతర్జాతీయ ఫోరంలలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, భవిష్యత్తులో దేశానికి అవార్డులు తీసుకురావడానికి ఇలాంటి రెగ ట్టా క్రీడలు మార్గం సుగమం చేస్తాయని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు వివిధ 11 క్లబ్‌ల నుండి అన్ని రాష్ట్రాల నుండి మొత్తం 89 మంది పాల్గొనేవారు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారిలో 11 మంది మహిళలు కాగా 17 మంది తెలంగాణ నుండి పాల్గొంటున్నారన్నారు. వారం పాటు ఆలరించే ఈ ఈవెంట్ 9న ముగియనుందని, కాగా మురళీ కానూరి అనే 72 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారుడు ఇందులో పాల్గొంటుండడం విశేషం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News