Sunday, April 28, 2024

అమెరికాలో హైదరాబారీ మృతి

- Advertisement -
- Advertisement -

Hyderabad techie dies in USA on Nov 27

హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీధర్ పానుగంటి (39) ఈనెల 27న అనుమానస్పద రీతిలో మృతి చెందారు. ఈక్రమంలో శ్రీధర్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచుస్తున్నారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ మేడిపల్లి కి చెందిన పానుగంటి శ్రీధర్‌కు భార్య, ఐదేళ్ల కొడుకున్నారు. ఉద్యోగరిత్యా శ్రీధర్ న్యూయార్క్‌లో నివాసముండగా భార్య, ఐదేళ్ల కొడుకు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీధర్‌కు కొద్ది రోజుల క్రితం శ్వాస తీసుకోవటంలో కొంత ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. తనకు వైద్యులు ఆస్తమా ఉన్నట్లు నిర్ధరించి వ్యాధి తగ్గుముఖం పట్టేందుకు మందులు ఇచ్చారు.

అస్తమాను నియంత్రించే మందులను శ్రీధర్ నాలుగు రోజుల పాటు వాడిన అనంతరం తాను అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు కుటుంబ సభ్యులకు వివరించారు.ఈ నేపథ్యంలో నవంబర్ 26 రోజు రాత్రి సైతం కుటుంబసభ్యులందరితో సరదాగా ఫోన్లో మాట్లాడి పడుకున్న శ్రీధర్ మరుసటి రోజు పొద్దున భార్య చేసిన ఫోన్‌కి స్పందించలేదు.దీంతో అనుమానమొచ్చిన కుటుంబసభ్యులు అక్కడే ఉన్న స్నేహితులకు సమాచారమివ్వగా శ్రీధర్నిద్రలోనే కన్నుమూసినట్లు తెలిపారు. దీంతో శ్రీధర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని వెల్లడించారు. శ్రీధర్ మృతికి కారణాలను అన్వేషించడంలో భాగంగా వైద్యులు మృతదేహాన్ని మరింత లోతుగా పరిశీలించాలని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత న్యూయార్క్ సిటిలోని పరిస్థితుల కారణంగా శ్రీధర్ మృతి పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

మృతదేహం కోసం…

బోడుప్పల్ మేడిపల్లి కి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీధర్ పానుగంటి నిద్రలోనే మృత్యువాత పడటంతో అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించాలని, చివరి చూపు కోసం తమకు సహాయం చేయాలని కోసం కుటుంబ సభ్యులు మంత్రి కెటిఆర్‌ను వేడుకున్నారు. శ్రీధర్ కుటింబీకులకు అమెరికా లో తెలిసిన వారు ఎవరు లేకపోవడం అక్కడి అధికారులు సైతం స్పందిచకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అమెరికా అధికారులతో సంప్రదించి శ్రీధర్ మృతదేహం త్వరగా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. శ్రీధర్ మృతదేహం భారత్ రప్పించాలని విదేశాంగ శాఖను, మంత్రి కెటిఆర్‌ను కుటుంబసభ్యులు సాయం కోరారు. కాగా శ్రీధర్ మృతదేహం ఇండియాకు తరలించడంలో మంత్రి కెటిఆర్ విదేశాంగ మంత్రికి సమాచారం అందించడంతో పాటు అనతికాలంలో అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News