Tuesday, May 7, 2024

యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్ సేవలు రద్దు

- Advertisement -
- Advertisement -

Hyderabad US Consulate services cancelled

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో మే3 నుంచి యు.ఎస్.కాన్సులేట్ జనరల్ హైదరాబాద్‌లో అన్ని సాధారణ సేవలు నిలిచిపోనున్నాయి. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్‌లు, వీసా రెన్యువల్స్ సహా అన్ని సాధారణ వీసా సేవలును రద్దు చేస్తున్నట్లు యు.ఎస్.కాన్సులేట్ జనరల్ ట్విట్టర్‌లో ప్రకటించింది. మంగళవారం(ఏప్రిల్ 27) నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు యు.ఎస్. కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అన్ని సాధారణ అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొంది. కాగా, అత్యవసర అమెరికన్ సిటిజన్ సేవలు, వీసా నియామకాలు స్థానిక పరిస్థితులు అనుకూలించే వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈ సమయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన అత్యవసర అపాయింట్‌మెంట్స్‌ను కొనసాగించేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తామని తెలిపింది.

Hyderabad US Consulate services cancelled

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News