Monday, September 22, 2025

కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి: గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. గాజులరామారంలో నకిలీ పట్టాలతో భూములు కబ్జా చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా  నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేసి భూములను అమ్మారని, ఆ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారని, కబ్జా చేసిన వాటిలో 30శాతం మాత్రమే కూల్చివేశామని, కూల్చినవి కూడా నిర్మాణంలో ఉన్నవేనని తెలియజేశారు. సోషల్‌మీడియాలో దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ భూమిలోని 260 నిర్మాణాలను మాత్రమే తొలగించామని, కొందరు రౌడీషీటర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మండిపడ్డారు.

Also Read: గుండెకు డబుల్ ఆపరేషన్

ప్రస్తుతం 51 డిఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయని, త్వరలోనే 72కు పెంచుతామని, హైదరాబాద్ నగరంలో 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉన్నాయని రంగనాథ్ తెలియజేశారు. అక్రమణలకు గురైన నాలాలు గుర్తించి ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. నాలాల్లో పూడిక తొలగింపును ముమ్మరం చేశామని, వర్షం నీరు చెరువుల్లోకి పరిస్థితి, నీరు నిల్ల చేసే పరిస్థితి లేదన్నారు. కాంక్రీటైజేషన్ వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదని, అధిక పొల్యూషన్ వల్ల నగరాల్లోనే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని, పార్కులు, చెరువుల గురించి జన్-జడ్ ఆలోచించాలని, భవిష్యత్ అంతా యువతరానిదేనని, చెరువుల రక్షణ గురించి ఆలోచన చేయాలని రంగనాథ్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News