Sunday, May 5, 2024

ఆదాయం కోసం అప్పట్లో క్యాబ్ నడిపా: పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: సోవియట్ పతనమైన తొలినాళ్లలో ఆదాయం కోసం క్యాబ్ నడిపానని, సోవియట్ పతనం చాలా మందికి తీరని విషాదం మిగిల్చిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. రష్యా చరిత్రపై ఓ ఛానెల్ నిర్మిస్తున్న చిత్రంలో అంశాలుగా వీటిని ప్రభుత్వ రంగ వార్తా పత్రిక ఆర్‌ఐఎ నొవొస్తి ఆదివారం ప్రసారం చేసింది. సోవియట్ యూనియన్ పతనం చారిత్రక రష్యాకు ముగింపుగా ఆయన అభివర్ణించారు. కొన్ని సందర్బాల్లో అదనపు సొమ్ము అవసరం అయ్యేదని, కారు డ్రైవర్‌గా పనిచేసి సంపాదించేవాడినని చెప్పారు. కొన్ని నిజాలు చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉంటాయని కానీ అవి జీవితంలో జరిగినవేనని అన్నారు. 1991లో ఆర్థిక సంక్షోభం తరువాత సోవియట్ అనేక దేశాలుగా విడిపోయి రష్యా ప్రత్యేక దేశంగా ఏర్పడింది. సోవియట్ యూనియన్ ఉన్న సమయంలో పుతిన్ ఆ దేశ నిఘా సంస్థ కేజీబీలో ఏజెంట్‌గా పనిచేశారు.

I Drove Taxi after Soviet Union fall says Putin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News