Wednesday, May 1, 2024

అవి కూడా సినిమా కథల్లాంటివే

- Advertisement -
- Advertisement -

laxmi rai

 

“నాకు అప్పుడే పెళ్లేంటి..? కెరీర్‌లో ఇంకా చాలా ఎత్తుకి ఎదగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పెళ్లి ఆలోచనలు లేవు” అని తేల్చేసింది హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్. కెరీర్‌లో పలు హిట్స్ ఉన్న ఈ భామకి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలోని స్పెషల్ సాంగ్ ‘రత్తాలు…’ ప్రత్యేక ఇమేజ్‌ను తీసుకువచ్చింది. ‘రత్తాలు’ అనే పిలుపుని తాను ఎంజాయ్ చేస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. “నాకూ ప్రేమ కథలున్నాయి. అందులో నేను హీరోయిన్ అయితే నాకు హీరోలు చాలామందే ఉన్నారు. అవి కూడా సినిమా కథల్లాంటివే”అని చెప్పింది లక్ష్మీరాయ్. “లవ్ స్టోరీస్‌లో మంచి, చెడు రెండూ ఉంటాయి కదా” అనేసిన లక్ష్మీ రాయ్ ఆ లవ్ స్టోరీల్లోని హీరోల పేర్లు మాత్రం చెప్పలేదు. “అన్ని లవ్ స్టోరీస్ విజయ తీరాలకు చేరతాయని చెప్పలేం. నాకూ ఓ మంచి లవ్ స్టోరీ తప్పక వుంటుంది. ఆ స్టోరీలో ఖచ్చితంగా గెలుస్తాను. నాకు నచ్చినవాడితోనే నా పెళ్లి జరుగుతుంది. ఇప్పటికైతే అలాంటి ప్రేమ ఆలోచనలేవీ పెట్టుకోవడంలేదు” అని లక్ష్మీరాయ్ చెప్పింది.

 

I have Love stories
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News