Monday, April 29, 2024

చైనా ల్యాబ్‌లోనే వైరస్ పుట్టింది

- Advertisement -
- Advertisement -

Trump

 

కరోనా సృష్టిపై ట్రంప్ ఆగ్రహం
ఆధారాలు ఉన్నా చెప్పలేం
కట్టడి చేయకపోవడంతో కష్టాలు
చైనాపై తాజా సుంకాల హెచ్చరిక

వాషింగ్టన్ : కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని ఆరోపించారు. చైనాతో తలెత్తిన ఆర్థిక నష్టంపై తగు విధంగా తమ స్పందన ఉంటుందని, ఆ దేశంపై తాజాగా సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. చైనా సృష్టితో ప్రపంచవ్యాప్తంగా విలయం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులు అయ్యాయి. 2,33,000 మంది అకాల మరణం పొందాల్సి వచ్చిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైరస్ మానవ సృష్టే అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే అనుకోకుండా వెలువడిందని చెప్పడానికి ఆధారాలు లేవని ఒక్కరోజు క్రితమే అమెరికా నిఘా వర్గాలు గురువారం తెలిపాయి. అదే విధంగా ఇది జంతువుల నుంచి వచ్చిందని చెప్పడంపై కూడా స్పష్టత లేదని వెల్లడించారు. అయితే ఈ స్పందనకు వ్యతిరేకంగా శుక్రవారం ట్రంప్ తమ ఘాటైన వ్యాఖ్యలతో చైనాపై విరుచుకుపడ్డారు.

ప్రపంచస్థాయిలో జరిగిన నష్టం దారుణం అని విమర్శించారు. వైట్‌హౌస్‌లో రోజువారి ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. వూహాన్‌లోని వైరాలజీ ఇనిస్టూట్ (డబ్లువి) నుంచే ఈ వైరస్ బయటకు వెలువడిందని పూర్తి నమ్మకంతో చెప్పగలరా? అని ట్రంప్‌ను ఓ విలేకరి నిలదీశారు. దీనికి ట్రంప్ స్సందిస్తూ అవునని పదేపదే చెప్పారు. అయితే దీనిపై తాను ఇప్పటికిప్పుడు వివరాలను, ఆధారాలను పొందుపర్చడం కుదరదని తెలిపారు. అయితే ఈ అంశంపై తగు విధంగా దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే తగు సమయంలో విషయం వెలుగులోకి వస్తుందన్నారు. వూహాన్ ల్యాబ్ నుంచే ఇది వెలుగులోకి వచ్చిందని ఖచ్చితంగా చెప్పడంపై విలేకరులు నిలదీయగా , దీనిపై పూర్తి వివరాలు తాను బయటకు చెప్పడం కుదరదని, అందుకు తనకు అనుమతి లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. వైరస్ ప్రపంచవ్యాప్తికి తాను చైనా అధినేత జి జిన్‌పింగ్‌ను ఏమి అనదల్చుకోలేదని, , ఆయన బాధ్యతను ప్రశ్నించడం లేదని తెలిపారు.

అయితే చైనా సకాలంలో సరైన విధంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని, ప్రపంచం అంతా కూడా ఈ విధంగానే అనుకొంటోందని చెప్పారు. వూహాన్‌లోనే వైరస్‌ను కట్టడి చేసి ఉంటే ప్రపంచం పరిస్థితి ఇప్పుడు మరో విధంఆ ఉండేదని ట్రంప్ స్పష్టం చేశారు. వైరస్ చైనా సృష్టే. అయితే వారు దీనిని నియంత్రించలేకపోయి ఉంటారు, లేదా కావాలనే వదిలేశారు. ఏది ఏమైనా వారి చర్యలతో ఇప్పుడు ప్రపంచం అంతా మూల్యం చెల్లించుకోవల్సి వస్తోందని అన్నారు. ఏదో విధంగా వైరస్ చైనాలో పుట్టిందని అనుకున్నా, దీని గురించి ముందుగానే వారికి తెలిసినా చైనా నుంచి విమానాలు రావడం పోవడం ఎందుకు నిలిపివేయలేదని ట్రంప్ ప్రశ్నించారు. యధావిధిగా విమాన ప్రయాణాలను సాగనిచ్చారు. చైనా నుంచి అమెరికాకు, యూరప్ దేశాలకు రవాణా సాగడంతో విషమ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటలీ ఇతర దేశాల పరిస్థితికి కారణం ఎవరంటారు? అని ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) చర్యలు సిగ్గుచేటుగా ఉన్నాయని మరోసారి ట్రంప్ ఫైరయ్యారు. చైనాకు ఈ సంస్థ చివరికి ప్రజా సంబంధాల సంస్థ (పిఆర్‌ఎ)గా మారిందని మండిపడ్డారు.

 

Trump said corona virus originated in China Lab
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News