Monday, April 29, 2024

అడ్డగోలు మాటలతో ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

- Advertisement -
- Advertisement -

etela

 

22 మంది డిశ్చార్జ్, 1044కి చేరిన కరోనా పాజిటివ్‌ల సంఖ్య
ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం
ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటది
అర్థరహితమైన ఆరోపణలు చేసి వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు
మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదు కాగా, 22 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజటివ్‌ల సంఖ్య 1044కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 464కి పెరిగిందని తెలిపారు. శుక్రవారం ఆరోగ్యవంతంగా ఇంటికి వెళ్లిన వారిలో హైదరాబాద్‌కి చెందిన 16 మంది, సూర్యాపేట్ నుంచి 3, వికారాబాద్ 2, ఆసిఫాబాద్ చెందిన మరొకరు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 552 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. గతంలో పోల్చితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. కోఠి కమాండ్ కంట్రోల్‌లో వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి ఈటల మాట్లాడుతూ“ లాక్‌డౌన్ వలనే రాష్ట్రంలో కేసులు సంఖ్య తగ్గింది. భారత ప్రభుత్వం పిలుపు మేరకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా లాక్‌డౌన్ పాటించింది. సిఎం పిలుపు మేరకు అన్ని జిల్లాల ప్రజలు సంపూర్ణమైన మద్దతుతో కరోనా కట్టడి కోసం కృషి చేయడం హర్షనీయ మన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు లాక్‌డౌన్‌ను అద్బుతంగా పాటిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యం చూసి అమెరికాలో ఉండే తెలుగు ప్రజలు కూడా అభినందనలు తెలుపుతున్నారన్నారు. వైరస్ నియంత్రణపై వారికి ఎంత నిబద్ధతో పనిచేస్తున్నారో అర్ధం అవుతోంది. మళ్లీ సిఎం పిలుపు నిచ్చే వరకు గ్రామల్లో ఒక్క ట్రాక్టర్‌ను కూడా రానివ్వలేదని, ఎక్కడికక్కడ కందకాలు, రాళ్లు పెట్టి ఒక్క వ్యక్తిని కూడా బయటకు వెళ్లకుండా గ్రామస్థాయి సిబ్బంది పనిచేస్తున్నాని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి అన్నారు.

ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలి…..
‘కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు పనిచేస్తుంటే ప్రతిపక్షాలు గుడ్డిగా మాట్లాడటం సరికాదని మంత్రి ఈటెల అన్నారు. కరోనా నివారణపై ఐసిఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, కానీ ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేయకపోవడం వలనే కేసులు తగ్గుతున్నాయనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ మేరకు టెస్టులు చేస్తూ, కరోనాని కట్టడి చేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ లేని వైరస్‌పై ప్రజలంతా ఏకమై పోరాడుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ లబ్థికోసం తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

మర్కజ్ అంశంపై దేశాన్ని అలర్ట్ చేశాం….
‘మర్కజ్ లింక్‌ను మొట్టమొదటి సారిగా గుర్తించి, దేశాన్ని అలెర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్రమని మంత్రి ఈటల తెలిపారు. మర్కజ్ లింక్ ఆలస్యంగా గుర్తించే ఉంటే దేశవ్యాప్తంగా పరిస్థితులు వేరేలా ఉండేవన్నారు. ఇండోనేషియన్ల నుంచి మార్చి 16న మర్కజ్ లింక్‌ను గుర్తించి అందరికి అప్రమత్తం చేశామన్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న 1244 మందిని పట్టుకొని వేగంగా పరీక్షలు చేశామన్నారు. కమ్యూనిటీ గుర్తించి 10వేల మందకిపైగా పరీక్షలు నిర్వహించామన్నారు. వైరస్‌ను కట్టడి చేస్తూ, పాజిటివ్ వచ్చిన వారికి వేగంగా చికిత్సలు చేస్తూ కరోనాని నివారిస్తున్నామని ఈటల తెలిపారు.

లక్ష మందికి వైద్యం చేసే సత్తా ఉంది
‘రాష్ట్రంలో కరోనా కట్టడిపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, ఇప్పటికే కరోనా కంట్రోల్ ఉందని మంత్రి ఈటల తెలిపారు. లక్ష మందికి కరోనా వచ్చినా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పాజిటివ్ వచ్చిన కేసుల సంఖ్యలో క్యూర్ రేట్ 47 శాతం ఉంద న్నారు. దేశంలో ఎక్కడా ఈ రికవరీ రేట్ లేదన్నారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యం
‘రాష్ట్రంంలో ఆర్థిక వ్యవస్థ ఆదుపు తప్పినా, ప్రజల ప్రాణాలే ముఖ్యంగా సిఎం నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుత విషయంలో రాజకీయలు, మతం కోసం మాట్లాడోద్దు. తెలంగాణలో అవి చెల్లవు. ప్రాణం పోతే తిరిగి రాదు అని చెప్పిన ముఖ్యమంత్రి సిఎం కరోనా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఆనందం కలిగించింది. మరణాలు దాస్తే దాగివే కాదు. కేసులు విషయంలో దాపరికం లేదు. కంటైన్‌మెంట్ల్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

6 Corona positive cases registered
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News