Saturday, April 20, 2024

యువతుల ప్రేరణకు, క్రీడల్లో పాల్గొనేందుకు డబ్య్లుపిఎల్ తోడ్పడగలదు: నీతా అంబానీ

- Advertisement -
- Advertisement -

ముంబై: డివై. పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఆటలో, జట్టు యజమాని నీతా ఎం అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. టోర్నమెంట్‌ను ఉత్కంఠభరితంగా ప్రారంభించేందుకు ముంబై ఇండియా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఆటను బ్యాటింగ్, బౌలింగ్ రెండింటితో నియంత్రించింది, ప్రారంభ మ్యాచ్‌లో భారీగా 143 పరుగులను నమోదు చేసింది.

స్టేడియంలో మహిళలు, పురుషులు ఇద్దరూ మహిళా క్రికెట్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతి బాల్‌కు ఉత్సాహపరిచారు నీతా అంబానీ. మరింత మంది మహిళలు క్రీడలు ఆడేలా చేయడం ఆమె లక్షం. ఆ తర్వాత సాంప్రదాయ ముంబై ఇండియన్స్ పోస్ట్ గేమ్ డ్రెస్సింగ్ రూమ్ వేడుకలకు ఆమె నాయకత్వం వహించారు. డబ్య్లుపిఎల్ ప్రారంభ రోజు మరచిపోలేని సంఘటన అని శ్రీమతి అంబానీ అన్నారు. ‘ఇది క్రీడారంగంలో మహిళలకు మరచిపోలేని సంఘటన’ అన్నారు. డబ్ల్యుపిఎల్ పాల్గొనడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’ అని ఆమె చెప్పింది.

‘ముంబై ఇండియన్స్ నిర్భయంగా, ఎక్సయిటింగ్‌గా ఆడతారు. మా క్రీడాకారిణులు నేడు బాగా ఆడారు. వారి ఆటకు నాకు చాలా గర్వంగా ఉంది. కెప్టెన్ హర్మన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె బాగా ఆడింది. అమేలియా కెర్ చాలా ప్రసిద్ధ క్రీడాకారిణి. బ్యాటింగ్, బౌలింగ్ రెండూ బాగా ఆడింది’ అన్నారు.

ప్రేక్షకులను ఉద్దేశించి ఆమె గట్టిగా అరిచి చెప్పారు. ‘ఈ స్టేడియంలో పెద్ద ఎత్తున మిమ్మల్ని చూడడం గొప్పగా ఉంది. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో వచ్చారు’ అన్నారు. టీమ్ అభిమానులను ఉద్దేశించి ‘ఎంఐ పల్టన్’(ముంబై ఇండియన్స్ సేన) అన్నారు. ‘మన అమ్మాయిలకు మద్దతునివ్వండి. వారికి మరింత బలాన్ని ఇవ్వండి. ఈ టోర్నమెంట్ ప్రారంభ సందర్భంగా నేను అన్ని జట్లను అభినందిస్తున్నాను’ అని నీతా అంబానీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News