Saturday, April 27, 2024

హెచ్1 బి వీసా ప్రక్రియ మార్చేస్తాం: బిడెన్

- Advertisement -
- Advertisement -

హెచ్1 బి వీసా ప్రక్రియ మార్చేస్తాం
బిడెన్ వెల్లడి..ఇండో అమెరికన్ల పాలసీ

If Elected will Revoke H-1B Visa Suspension: Joe Biden

వాషింగ్టన్: తాము అధికారంలోకి వస్తే దేశంలో హెచ్ 1 బి వీసా వ్యవస్థను పూర్తిగా సంస్కరిస్తామని అమెరికా అధ్యక్ష పదవి బరిలో నిలిచిన జో బిడెన్ చెప్పారు. ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఆయన తమ ప్రచారపర్వం సాగిస్తున్నారు. వీసా విధానాలలో పలు మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. ఇక గ్రీన్‌కార్డుల జారీలో ఉన్న పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు. అమెరికాలోని భారతీయ సంతతి అమెరికన్లను ఆకట్టుకునేందుకు ఆయన ఈ వీసా, గ్రీన్‌కార్డుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ట్రంప్ తమ నిర్ణయాలతో ఎప్పటికప్పుడు హెచ్-1బి వీసాలను టార్గెట్ చేసుకోవడం, గ్రీన్‌కార్డులకు ఎదురుచూపుల ప్రక్రియ సాగడంతో ఈ అంశాన్ని బిడెన్ ప్రధానంగా తమ నినాదంగా ఎంచుకున్నారు. ఇండో అమెరికన్లకు సంబంధించి బిడెన్ అత్యంత కీలకమైన పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యాన్ని ఎంచుకుని, ఇండో అమెరికన్లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ బిడెన్ తమ పార్టీ తరఫున ఈ విధాన పత్రాన్ని వెలువరించారు. కుటుంబ ప్రాతిపదిక ఇమిగ్రేషన్ వ్యవస్థకు తాము అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని, మతపరమైన ప్రచార కార్యకర్తలకు ఇచ్చే వీసాల విధానాన్ని క్రమబద్ధీకరిస్తామని కూడా తెలిపారు.వలసదార్ల భద్రత, వారి హక్కులకు తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు. దేశంలో పెరుగుతున్న విద్వేష, జాతిపరమైన ధోరణులకు తాము చెక్ పెడుతామని తెలిపారు. ప్రార్థనా స్థలాలకు సరైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా భాషాపరమైన అడ్డుగోడలు లేకుండా చేస్తామని, వైవిధ్యతను, బహుళత్వాన్ని పరిరక్షిస్తామని, ఇక్కడి జాతీయ స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధికి పాటుపడుతున్న ఇండో అమెరికన్లకు సరైన ఆదరణ తమ హయాంలో దక్కుతుందని తెలిపారు. దేశంలో దాదాపుగా 1.3 మిలియన్ల అర్హులైన ఇండో అమెరికన్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ప్రధానమైన ఎన్నికల హోరాహోరీ రాష్ట్రాలైన ఎనిమిది రాష్ట్రాలలోఇండో అమెరికన్ల ఓట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఇక్కడి భారతీయ సంతతి వారితో బిడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

If Elected will Revoke H-1B Visa Suspension: Joe Biden

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News