Tuesday, April 30, 2024

ఎల్‌బి స్టేడియంలో రేపు ఇఫ్తార్ విందు

- Advertisement -
- Advertisement -

అన్ని ఏర్పాట్లు పూర్తి
పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ

Iftar dinner tomorrow at LB Stadium

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్‌బిస్డేడియంలో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో పాటు పలువురు మత పెద్దలు, ప్రముఖులు హాజరు కానుండడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఇఫ్తార్ విందుకు సంబంధించి గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీలు ఎల్‌బి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్బంగా మంత్రులు వివిధ శాఖల అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు వారి వారి పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని మతాల పండుగలకు సమాన గౌరవం ఇవ్వడంతో పాటు ముఖ్యమైన పండుగలకు నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరుపున బట్టలను అందజేస్తున్నమన్నారు. అంతేకాకుండా పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందును ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఇఫ్తార్ విందును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్మామని ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లను చేసినట్లు మంత్రులు వెల్లడించారు.

సాయంత్రం రోజా పూరైన తర్వాత ప్రత్యేక నమాజ్ అనంతరం ఇఫ్తార్ విందు ప్రారంభం కానుందని మంత్రులు తలసానిశ్రీనివాస్ యాదవ్, మహమదూ అలీలు చెప్పారు. ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న ప్రతినిధులకు ప్రత్యేక పాసులను అందజేయడం జరిగిందని చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు సంబంధించి ఎల్‌బి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 6 ప్రదేశాలను గుర్తించామన్నారు. ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కానున్నడడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఎల్‌బి స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాధారణ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఈ సమిక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనార్టీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద నదీమ్, డైరెక్టర్ షహనవాజ్ ఖాసీం, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఐజి రంగనాథ్, జాయింట్ కమిషనర్ డి.ఎస్.చౌహన్, బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News