Saturday, April 20, 2024

సూపర్‌బగ్స్‌ను నిరోధించే కొత్త మోలిక్యూల్ ఐఐటి ఆర్ 00693

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రూర్కె కు చెందిన పరిశోధకులు మందులకు లొంగని సూపర్‌బగ్స్ బ్యాక్టీరియాను నిరోధించగల సూక్ష్మ అణువు ( మోలిక్యూల్)ను కనుగొనగలిగారు. మందులను ప్రతిఘటించే మొండి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా ఇది పోరాటం సాగించగలదని వెల్లడించారు. అత్యంత కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియ తరువాత ఈ ఐఐటి ఆర్ 00 693 అనే ఈ అణువును కనుగొన గలిగామని పరిశోధకులు చెప్పారు. విస్తారమైన గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా సమర్థమైన చర్యలను చేపడుతుంది.

అంతేకాదు ఔషధాలకు లొంగని సమస్యాత్మకమైన బ్యాక్టీరియా తెగలను కూడా నివారించగలుగుతుంది. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటే ఊదా రంగులో మారే బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటే న్యూమోనియా వంటి వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా. చర్మానికి సంక్రమించే అంటు వ్యాధుల చికిత్స కోసం వాడే ఔషధాలను ప్రతిఘటించే బ్యాక్టీరియా వ్యాపించడం ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారి నివారించవలసిన అత్యవసరం ఏర్పడింది. ఈమేరకు కొత్త చికిత్స ప్రక్రియల అన్వేషణకు పురిగొల్పింది.

మందులకు ఏమాత్రం లొంగని బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధులను చికిత్స చేయడానికి ప్రస్తుతం వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్ సామర్థాన్ని మరింత శక్తివంతం చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకు తగ్గట్టు చికిత్సకు ఉపయోగించే యాంటీబయోటిక్స్ చర్యలను శక్తివంతం చేసే ఐఐటి ఆర్ 00693 అణువును కనుగొన్నారు. ముఖ్యంగా చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే యాంటీబయోటిక్స్‌ను ప్రతిఘటించే స్టెఫిలో కాకస్ ఆరియస్ , సుడోమోనస్ ఎరుగినోసా అనే రెండు హానికరమైన బ్యాక్టీరియాలను పరిశోధకులు కనుగొన్నారు.

ఐఐటి ఆర్ 00693 (iit r 00693) రెండు విధాలా ఉపయోగపడే కత్తి వంటిది. అత్యంత మొండి బ్యాక్టీరియాను నిర్మూలించడమే కాక, ప్రతిఘటన యొక్క ఆవిర్భావాన్ని కూడా అడ్డగిస్తుంది. కొన్ని తరాల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. స్టెఫిలోకాకస్ ఆరియస్, సుడోమోనస్ ఎరుగినోసా బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోలిమిక్సిన్ బీ చర్యను ఐఐటి ఆర్ 00693 ప్రేరేపిస్తుందని పరిశోధకులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News