Monday, June 24, 2024

నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధిలో మెరుగు : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : మిషన్ భగీరథ, కాకతీయ లాంటి పథకాలను నాణ్యంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న ఘనత క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సంస్థ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆ సంస్థ చాప్టర్ 37వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నది నాణ్యత ప్రమాణాలు మాత్రమే అన్నారు. ఈ సంస్థ నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నది. హరితహారంలో అనేక మొక్కలు నాటారు. మిషన్ భగీరథ, కాకతీయ లాంటి పథకాలను నాణ్యంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న ఘనత ఈ సంస్థది. చైర్మన్ సిహెచ్ బాలకృష్ణారావుకు అభినందనలు. కార్యక్రమంలో క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News