Sunday, April 28, 2024

పాక్ అణ్వాయుధ పిత ఎక్యుఖాన్ మృతి.. సంతాపం తెలిపిన పాక్ ప్రధాని

- Advertisement -
- Advertisement -
Imran Khan also condoled aq Khan's death

ఇస్లామాబాద్: పాకిస్థాన్ అణ్వాయుధ పిత అబ్దుల్‌ఖాదిర్‌ఖాన్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖాన్‌ను ఆదివారం ఉదయం హాస్పిటల్‌లో చేర్పించారు. 7 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. ఆగస్టు 26న ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత రావల్పిండిలోని మిలిటరీ హాస్పిటల్ నుంచి ఆయణ్ని డిశ్చార్జ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్తూ తిరిగి హాస్పిటల్ పాలయ్యారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో ఆయన మరణించారని డాక్టర్లు తెలిపారు. 1936లో ఖాన్ భోపాల్‌లో జన్మించారు. 1947లో దేశ విభజన కారణంగా పాకిస్థాన్‌కు ఆయన కుటుంబం వలస వెళ్లింది. దేశానికి అణ్వాయుధాన్ని అందించిన ఖాన్‌కు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుందని పాక్ అధ్యక్షుడు అరీఫ్‌అల్వీ తన సంతాప సందేశాన్ని ట్విట్ చేశారు. అణ్వాయుధాలతో శక్తివంతంగా ఉన్న పొరుగు దేశాన్ని ఎదుర్కొనేందుకు అణుఅస్త్ర దేశంగా మలిచిన ఖాన్ తమ జాతికి ఆదర్శమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News