Tuesday, May 7, 2024

వంద శాతం రెవెన్యూ పెంచాలి

- Advertisement -
- Advertisement -
ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు

హైదరాబాద్: రెవెన్యూ కలెక్షన్లను వందశాతం వసూలు చేయాలని, మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెని లిమిటెడ్ (ఎన్‌పిడిసిఎల్ )సిఎండి అన్నమనేని గోపాలరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్ధానిక విద్యుత్‌భవన్(హన్మకొండ)లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం నివారించేందుకు విధిగా లైన్ల పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. దత్తత తీసుకున్న గ్రామాలలోని పనులను పూర్తి చెయ్యాలని అన్నారు. 33/11 కెవి బ్రేక్ డౌన్స్,అంతరాయాలు,ట్రిప్పింగ్స్ తగ్గించడమే కాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు,తగ్గించి వాటి రోలింగ్ స్టాక్‌ను పెంచుకోవాలన్నారు.

ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లు పెంచడమే కాకుండా సబ్ స్టేషన్ల నిర్వహణ చేపట్టాలన్నారు.ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్ ఉండి విధులు నిర్వర్తించాలని, వ్యవసాయ సర్వీసులు మంజూరు వేగవంతం చెయ్యాలన్నారు. టిఎస్‌ఐపాస్, దోభీఘాట్, నాయిబ్రాహ్మణ,లాండ్రీ షాపుల సర్వీసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. వినియోగదారుల నుండి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకొని మెరుగైన సేవలందించాలన్నారు.ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు బి. వెంకటేశ్వరరావు, పి.గణపతి, పి. సంధ్యారాణి, పి. మోహన్ రెడ్డి, శ్రీ వి. తిరుపతి రెడ్డి,జనగాం, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల ఎస్‌ఈలు, డీఈలు,ఎస్‌ఏఓలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News