Saturday, April 27, 2024

సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

గద్వాల : సమాజాభివృద్ధ్దిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని మహిళలు లేని సమాజాన్ని ఊహించుకోలేమని జడ్పి చైర్ పర్సన్ సరిత అన్నారు. మంగళవారం బృందావన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళ సంక్షేమ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా సంక్షేమంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు. ముఖ్యమంత్రి మహిళల ఆత్మగౌరవం పెంచేలా పలు అభివృద్ధ్ది సంక్షేమ కార్యక్రమాలలో మహిళలకు పెద్దపీట వేశారని తెలిపారు. స్త్రీ లే గమనం, స్త్రీలే జననం స్త్రీలు లేని సమాజం ఊహించుకోలేనిదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు వెన్నంటి ఉండే అమ్మఒడి, కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ తదితర పథకాలు మరింత ఖ్యాతిని పెంచాయని తెలిపారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచిందన్నారు. మహిళలు ఏం చేయగలుగుతారు. అనే నినాదం తొలగించి అన్ని రంగాలలో మహిళలు ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఎక్కడ మహిమలు గౌరవించబడుతుందో అ క్కడ లక్ష్మీతాండవిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో మహిళ దినోత్సవం ప్రాధాన్యత సంతరించుకున్నదని తెలిపారు. మహిళలు తల్లీ బిడ్డల సంక్షేమమే సమాజ ప్రగతికి తొలిమెట్టని, గర్భిణీలు , బాలింతలు, చిన్నారులలో పౌష్టికహార లోపం, రక్తీహీనత నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పిల్లలో సమస్య పోవడానికి బాలామృతం , న్యూట్రిషన్ కల్పించడం జరిగిందన్నారు. వితంతువులకు పెన్షన్ కల్పించినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు అంగన్‌వాడీ కేంద్రాలు బలహీనంగా ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డా క కేంద్రాలను బలోపేతం చేసి గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం చేసి గర్భిణీలకు బాలింతలకు చిన్నారులకు పౌష్టికాహారం, గుడ్లు, నూట్రిషన్ అందజేస్తున్నట్లు తెలిపారు. రూ. 3400 ఉన్న అంగన్‌వాడీ జీతం నేడు రూ. 13వేలకు పెంచడం జరిగిందన్నారు. గ్రామాలలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలలో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఉత్తమ మహిళలకు ప్రశంసా ప త్రాలు అందజేశారు. బాలసదనం విద్యార్థులు చేసి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ముసాయిదాబేగం, గ్రంథాలయ చైర్మన్ రామన్‌గౌడ్, డిఆర్డీఓ అధికారి ఉమాదేవి, జిల్లా అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News