Sunday, April 28, 2024

ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా..

- Advertisement -
- Advertisement -

IND A vs AUS A Practice Test Match Draw

సిడ్నీ: టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా భారత్‌ఎ, ఆస్ట్రేలియాఎ జట్ల మధ్య జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సుదీర్ఘ ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా భారత్ ఆడుతున్న తొలి సాధన మ్యాచ్ ఇదే. టెస్టు సిరీస్ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించారు.ఇందులో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన టెస్టు క్రికెటర్లు పాల్గొన్నారు. మూడు రోజుల మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. మంగళవారం చివరి రోజు ఆస్ట్రేలియాఎ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. యువ ఆటగాడు క్రిస్ గ్రీన్ అజేయ శతకంతో ఆదుకున్నాడు.

భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న గ్రీన్ 12 ఫోర్లు, సిక్సర్‌తో 125 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్, ఉమేశ్ మూడేసి వికెట్లు తీశారు. ఆశ్విన్‌కు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌ఎ తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు పుజారా (౦) ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్లు పృథ్వీ షా (19), శుభ్‌మన్ గిల్ (29) పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. కెప్టెన్ అజింక్య రహానె 28 పరుగులు సాధించగా, హనుమ విహారి మూడు ఫోర్లతో 28 పరుగులు చేశాడు. ఇక ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఏడు ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పీడ్‌స్టర్ మార్క్ స్టెకెటి ఐదు, నెసర్, గ్రీన్ రెండేసి వికెట్లను పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News