Sunday, April 28, 2024

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

- Advertisement -
- Advertisement -
india celebrate 70th constitution day

మనతెలంగాణ,హైదరాబాద్: కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్‌ఒబి) అధ్వర్యంలో కోఠి మహిళా కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ హరిబాబు, ప్రిన్సిపాల్ విద్యుల్లత, ప్రొఫెసర్ అరుణ, ఎగ్జిబిషన్ అధికారి అర్థ శ్రీనివాస్‌పటేల్ విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. నగరానికి చెందిన వివిధ కళాశాల విద్యార్థినులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, బహుమతులు ప్రధానం చేశారు. రాజ్యాంగ రూపకల్పన, విశిష్టతలపై ఏర్పాటుచేసిన చాయా చిత్ర ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకున్నది. కార్యక్రమంలో ఆర్‌ఒబి అసిస్టెంట్ డైరెక్టర్ భారతలక్ష్మి, టూరిజం అసిస్టెంట్ డైరెక్టర్ శతరూపదత్త, పోస్టల్ డిపార్ట్‌మెంట్ సూపరిండెంటెంట్ విష్ణుజ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ కవిత, అధ్యాపకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News