Sunday, April 28, 2024

టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం

- Advertisement -
- Advertisement -

అగ్రస్థానంలో ఆస్ట్రేలియా


దుబాయి : అంతర్జాతీయ క్రికెట్ మం డలి (ఐసిసి) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఒక స్థానా న్ని మెరుగు పరుచుకుని నాలు గో స్థానంలో నిలిచింది. లంకపై సాధించిన సిరీస్ విజయం టీమిండియాకు భారీ ఉపశమనం కలిగించిందనే చెప్పా లి. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 12 తేడాతో ఓటమి పాలు కావడంతో టెస్టు చాంపియన్‌షిప్ పాయిం ట్ల పట్టికలో భారత్ ఒక అడుగు కింది కి పడిపోయింది. అయితే లం కపై క్లీన్‌స్వీప్ సాధించడంతో మళ్లీ నాలుగో ర్యాంక్‌కు ఎగబాకింది. ఇక తొలి టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో భారత్ ఆరంభం నుంచే పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచింది.

కానీ ఈసారి మాత్రం టాప్3లో చో టు సంపాదించలేక పోతోంది. ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గతంతో పోల్చితే ఈసారి సౌతాఫ్రికా టెస్టుల్లో నిలకడగా రాణిస్తోంది. భారత్ వంటి బలమైన జట్టును సయితం టెస్టు సిరీస్‌లో ఓడించింది. ఇక ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో టెస్టు చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 77.77 గెలు పు శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ కంగారూలు విజయం సాధించడం విశేషం. ఇక సౌతాఫ్రికా 66.66 గెలుపు శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరోవైపు పాకిస్థాన్ 60.00 శాతం విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. టీమిండియా 58.33 విజయశాతంతో నాలుగో స్థానా న్ని దక్కించుకుంది. అయితే తొలి మూడు స్థా నాల్లో నిలిచిన జట్లతో పోల్చితే టీమిండియా 77 పాయింట్లు సాధించింది. అయినా ఐసిసి నిబంధనల ప్రకారం నాలుగో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక అగ్రశ్రేణి జట్టు ఇంగ్లండ్ ప్ర పంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అట్టడుగు స్థానం లో నిలవడం గమనార్హం. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ కూడా ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. కివీస్ కంటే శ్రీలంక ముందంజలో ఉం డడం విశేషం. ఇక కిందటి ఏడాది ప్రారంభమైన టెస్టు చాంపియన్‌షిప్ 2023లో ముగుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News