Sunday, April 28, 2024

ప్రపంచ అవినీతి సూచీలో మరింత దిగజారిన భారత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచ అవినీతి సూచీలో భారత్ మరింత దిగజారింది.గత ఏడాది(2022)కంటే ఈ ఏడాది( 2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయాయి.ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సూచీ ప్రకారం 2023 ఏదికి గాను మొత్తం 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది.2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంది. ప్పంచంలోని వివిధ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతిస్థాయిల ఆధారంగా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతి ఏటా ఈ నివేదికను రూపొందిస్తుంది. తాజాగా 2023కు సంబంధించి నివేదికను వెలువరించింది. అవినీతి స్థాయిని బట్టి దేశాలకు 0నుంచి 100 స్కోరు ఇస్తుంది.అత్యంత అవినీతి ఉన్న దేశానికి ‘0’ స్కోరు, అతి తక్కువ అవినీతి ఉన్న దేశానికి ‘100’ స్కోరు ఇస్తుంది. ఈ ఏడాది ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ భారత్‌కు 39 స్కోరు ఇచ్చింది. దీంతో 93వ స్థానంలో నిలిచింది. గత ఏడాది భారత్ 40 స్కోరుతో 85వ స్థానంలో ఉంది. ఇక దక్షిణాసియా దేశాల్లో పాకిస్థాన్, శ్రీలంక అత్యంత అవినీతి దేశాలుగా నిలిచాయి.శ్రీలంక 115వ ర్యాంకులో, పాకిస్థాన్ 133వ ర్యాంకులో ఉన్నాయి.

బంగ్లాదేశ్ 149వ ర్యాంకులో ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ఇప్పుడు అవనీతి బాగా తగ్గుతోంది. ఇక అవినీతి నిర్మూలన విషయంలో చైనా శరవేగంగా చర్యలు తీసుకుంటోంది.గడచిన దశాబ్ద కాలంలో చైనా ఏకంగా 37 లక్షల మంది ప్రభుత్వ అధికారులను శిక్షించింది. దాంతో ప్రస్తుతం చైనా 76వ ర్యాంకుకుఎగబాకింది. ఇక న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు వరసగా 3,5 రాయంకులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. అవినీతి నిర్మూలన చర్యలతో ఆస్ట్రేలియా(14), హాంకాంగ్(14), జపాన్(16),భూటాన్(26),తైవాన్(28), దక్షిణ కొరియా(32) కూడా తమ ర్యాంకులను మెరుగుపరుకున్నాయి. ఇకపోతే అత్యంత అమానవీయ పాలనతో అఫ్ఘానిస్థాన్ 162 ర్యాంకుతో జాబితాలో అట్టడుగున ఉంది. మయన్మార్ కూడా శ్రీలంకతో సమానంగా 162 ర్యాంకులోనే కొనసాగుతోంది. నియంత కిమ్ పాలనలోని ఉత్తర కొరియా 172 ర్యాంకుతో జాబితాలో మరింత దిగువన నిలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News