Wednesday, May 8, 2024

నిలకడగా కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

India reports 134154 new Covid-19 cases

 

దేశంలో తాజాగా 1.34 లక్షలు, 2,887 మంది మృతి
17 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
92.79% పెరిగిన రికవరీ రేటు
ఢిల్లీలో 576కు పడిపోయిన కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ నిలకడగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కఠిన ఆంక్షలు విధించడంతో రోజువారీ కొత్త కేసులు కొద్ది రోజులపాటు తగ్గుముఖం పట్టడంతో వైరస్ ఉధృతి తగ్గిందనే అందరూ భావించారు. అయితే గత రెండు రోజులుగా రోజువారీ కేసులు తగ్గకపోగా స్వల్పంగా పెరగడం గమనార్హం. తాజాగా గురువారం దేశవ్యాప్తంగా లక్షా 34 వేల కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే రెండు వే లు పెరిగాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,59,873 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,34,154 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే మరణాల సంఖ్య కాస్త్త తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గడచిన 24 గం టల్లో 2,887 మంది వైరస్‌తో పోరాడుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,84,41,986కు చేరగా, మరణాల సంఖ్య 3,37,989కి చేరింది.

ఈ మేరకు కేం ద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం బులెటిన్ విడుదల చేసింది. కాగా తాజాగా కరోనానుంచి 2,11,499 మంది కోలుకున్నారు. దీంతో కలిపి ఇప్పటివరకు 2,63,90,584 మంది కొవిడ్‌ను జయించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 17,13,413కు తగ్గాయి. వరసగా రెండో రోజు యాక్టివ్ కేసులు 20 లక్షలకు దిగువన ఉండడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో యాక్టివ్ కేసులు 80 వేలకు పైగా తగ్గినట్లు మంత్రిత్వ శాఖ తెలిపిం ది. దీంతో రికవరీ రేటు 92.79 శాతానికి చేరుకో గా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. కాగా దేశంలో టీకాల పంపిణీ కార్యక్రమం జోరందుకుంది. గడచిన 24 గంటల్లో టీకాలు పొందిన వా రు 24,26,265 మంది ఉన్నారు. దీంతో ఇప్పటిదాకా 22.10కోట్ల డోసులకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

ఢిల్లీలో వెయ్యికి దిగువనే కేసులు
కాగా చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ దేశంలో నమోదవుతున్న కేసుల్లో 67 శాతం తమిళనాడు, కేరళ, కర్నాటక,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఉండడం గమనార్హం. తమిళనాడులో గురువారం 25,317 కేసులు నమోదు కాగా, 19, 661 కేసులతో కేరళ, 16,387 కేసులతో కర్నాటక తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో 15,169 కేసులు నమోదయ్యా యి. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కేవలం 576 కొత్త కేసులు నమోదు కాగా, 103 మంది మృతి చెందారు. మూడో రోజు ఢిల్లీలో పాజిటివిటీ రేటు 1% కన్నా తక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News