Monday, May 20, 2024

దేశంలో కొత్తగా 2వేల కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

India reports 2539 new Covid-19 cases in 24 hrs

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,539 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 60 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4.30కోట్లుకు చెరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 4,491 మంది కోలుకోగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 4.24కోట్లకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇక, కరోనాతో దేశంలో మొత్తం 5,16,132 మంది బాధితులు మరణించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 30,799 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రోజువారి పాజిటీవిటి రేటు 0.35 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 180 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

India reports 2539 new Covid-19 cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News