Wednesday, May 8, 2024

దేశంలో ఒకే రోజు 60వేల మంది రికవరీ

- Advertisement -
- Advertisement -

24 గంటల్లో కరోనా కొత్త కేసులు 64,531, మరణాలు 1092

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ఘననీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం 8 గంటల వరకు 24గంటల్లో 60,091 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో, కోలుకున్నవారిమొత్తం సంఖ్య 20,37,870కు చేరింది. రికవరీ రేట్ 73.64శాతంగా నమోదైంది. మరణాల రేట్ 1.91 శాతానికి పడిపోయింది. కరోనాకు చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,76,514. దీంతో కేసు లోడ్ 24.45 శాతంగా నమోదైంది. అంటే చికిత్స పొందుతున్నవారి కంటే కోలుకున్నవారి సంఖ్య 13,61,356 అధికమని అర్థం. 24 గంటల్లో నమోదైన కేసులు 64,531. దీంతో మొత్తం కేసులు 27,67,273కు చేరాయి. ఒక్క రోజులో మరణించినవారి సంఖ్య 1092.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 52,889కు చేరింది. కరోనాకు సంబంధించి మొదటి కేసులు నమోదైన ఈ ఏడాది జనవరి నుంచే కేంద్రం ఎంతో అప్రమత్తతతో వ్యవహరించిందని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. కరోనా విషయంలో జీరో టాలరెన్స్‌తో కేంద్రం పని చేస్తోందని తెలిపింది. రాష్ట్రాల సమన్వయంతో కేసుల తీవ్రతకు అనుగుణంగా ఆస్పత్రులను వివిధ కేటగరీలుగా విభజించి మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1667 డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్స్(డిసిహెచ్‌లు), 3455 డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్స్(డిసిహెచ్‌సిలు), 11,597 డెడికేటెడ్ కొవిడ్ కేర్ సెంటర్స్(డిసిసిసిలు) పని చేస్తున్నాయి. వీటిలో 15,45,206 ఐసోలేటెడ్ బెడ్స్, 2,03,959 ఆక్సీజెన్ సపోర్టెడ్ బెడ్స్, 53,040 ఐసియు బెడ్స్ ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.

India seen 60K Corona Patients recover in 24 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News