Friday, April 26, 2024

స్వాతంత్ర్యపు హక్కు

- Advertisement -
- Advertisement -

స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు
ఆర్టికల్ 19: స్వేచ్ఛాహక్కు (ఆరు రకాల స్వేచ్ఛలు)
ఆర్టికల్ 20: శిక్ష నుండి రక్షణ పొందే హక్కు:
ఆర్టికల్ 21: జీవించే హక్కు
ఆర్టికల్ 22: అరెస్టు నుంచి రక్షణ పొందే హక్కు
ఆర్టికల్ 19 ఆరు రకాలు
19(1a): వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ
19(1b): శాంతి యుతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు (ఆయుధాలు లేకుండా)
19(1c): సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
19(1d): దేశవ్యాప్త సంచార స్వేచ్ఛ
19(1e): స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు
19(1g): ఇష్టం వచ్చిన వృత్తి (లేదా)వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ
నోట్: 19(1f) ఈ నిబంధన పౌరులు ఆస్తిని సంపాదించడం, ఖర్చు చేయడం గురించి పేర్కొంటుంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19(1f)ని తొలగించారు.
19(1a)లోని పరోక్ష అంశాలు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1a) భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది.
పత్రికా స్వేచ్ఛ పరోక్షంగా దీని కిందకు వస్తుంది.
పత్రికలతో పాటు కార్టున్స్, సినిమాలు, డాక్యుమెంట్స్, సోషల్ మీడియా వంటివి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తాయి.
19(1b) శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకోవచ్చు.
పరిమితులు: ప్రజా భద్రత, దేశ భద్రత దృష్టా పరిమితులు విధించవచ్చు.
19(1c): సంఘాలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు.
19(1c)లో భాగంగా 97వ సవరణ చట్టం ద్వారా సహకార సంస్థలు చేర్చారు.
ఈ నిబంధన ప్రకారం రాజకీయ పార్టీలు స్థాపించుకునే హక్కు ఉంది.
ఈ ఆర్టికల్ రాజకీయ న్యాయాన్ని అందిస్తుంది.
పరిమితులు: ఉగ్రవాదులు, పోలీసులు, సైనికులు సంఘాలు ఏర్పాటు చేసుకోరాదు.
19(1d): సంచార స్వేచ్ఛ
దేశవ్యాప్తంగా పౌరులు ఎక్కడికైనా సంచారం చేయవచ్చు.
పరిమితులు: ఆదివాసి ప్రాంతాలకు వెళ్లరాదు.
ప్రభుత్వం చట్ట పరంగా నిషేధించిన ప్రాంతాలకు వెళ్లరాదు.
19(1e): స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.
19(1g): ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ
ఆర్టికల్ 20 శిక్ష నుండి రక్షణ
20(1): అమలులో ఉన్న చట్టాల నుంచే శిక్షవేయాలి.
20(2): ద్వంద శిక్షలు రద్దు..అనగా ఒకే నేరానికి రెండు శిక్షలు వేయరాదు. కాని 2 నేరాలకు 2 శిక్షలు విధించవచ్చు.
20(3): బలవంతపు సాక్ష్యాలు చెప్పాలని ఒత్తిడి చేయరాదు.
ఆర్టికల్ 21: చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు
ఈ నిబంధన పరోక్షంగా జీవించే హక్కును సూచిస్తుంది.
1950 గోపాలన్ కేసు
గోపాలన్‌ను పి.డి చట్టం కింద అరెస్టు చేశారు.
ఇతను కోర్టును ఆశ్రయించడంతో పి.డి చట్టం కింద అరెస్టు సమర్ధమేనని న్యాయస్థానం పేర్కొంది.
పి.డి చట్టం కింద అరెస్టు చట్టబద్దమేనని, కేసు చల్లదని న్యాయస్థానం తెలిపింది.
మేనకా గాంధీ కేసు
మేనకా గాంధీ అమెరికా పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు.
ఈమె కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ప్రభుత్వాన్ని మందలించింది.
మేనకా గాంధీ పాస్‌పోర్టును
ఇవ్వాలని ఆదేశించింది.
ప్రభుత్వాలు పౌరుల సహజన్యాయ సూత్రాలు గుర్తించాలని న్యాయస్థానం పేర్కొంది.
21(ఎ) విద్యాహక్కు
విద్యాహక్కును 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2002లో చేర్చారు.
6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్భంద విద్యను కల్పించాలి.
విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్ 22: అక్రమ అరెస్టు నివారణ
అరెస్టుకు గల కారణాలు తెలియజేయాలి.
అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటలలోపు కోర్టులో హాజరు పరచాలి.
ఇది హెబియస్ కార్పస్ అనే రిట్‌ను సూచిస్తుంది.
ఆర్టికల్ 23: వెట్టి చాకిరీ నిషేధం
వెట్టి చాకిరీ, మనుషుల అక్రమ రవాణా నిషేధం
ప్రభుత్వం దీని అమలుకు కొన్ని చట్టాలు చేసింది. అవి
1976 వెట్టి చాకిరీ నిషేదం
1948 కనీస వేతనాల చట్టం
నోట్: ప్రభుత్వం స్వచ్ఛ్ భారత్ లాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు.
w ఆర్టికల్ 24: 14 ఏళ్లలోపు బాలబాలికలను ప్రమాధకర గనులు, ఫ్యాక్టరీల్లో పనిచేయించడం నిషేదం.
w దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం పలు రకాల చట్టాలు చేసింది. అవి
w 1986 బాల కార్మిక నిషేధ చట్టం
w 2007లో బాలల హక్కుల రక్షణ కమిషన్ ఏర్పాటు చేసింది.
w తెలంగాణలో బాల సంరక్షణ కేంద్రాలను ఏర్పటు చేశారు.
w భారత దేశంలో బాల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి.
మత స్వాతంత్య్రపు హక్కు
ఆర్టికల్ 25 మత సేచ్ఛ
ఆర్టికల్ 26 మత దర్మాదాయ సంస్థలు
ఆర్టికల్ 27 మత ప్రచారం కోసం పన్నులు విధించరాదు
ఆర్టికల్ 28 విద్యాలయాల్లో మత బోదన నిషేధం
మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25)
ప్రతి పౌరుడు తమకిష్టమొచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు.
మత ప్రచారం చేసుకోవచ్చు, కాని బలవంతపు మత మార్పిడికి పాల్పడరాదు.
మత ధార్మిక సంస్థలు(ఆర్టికల్ 26)
పౌరులు తమకు నచ్చిన మత ధార్మిక సంస్థలు స్థాపించుకోవచ్చు.
వాటికి స్థిర, చర ఆస్తులు కలిగి ఉండవచ్చు.
నోట్: ప్రాథమిక హక్కుల్లో ఆస్తిహక్కు తొలగించబడింది. కాని ఇక్కడ చెప్పబడే ఆస్తి హక్కు 26 ఆర్టికల్ రూపంలో ఉంటుంది.
ఆర్టికల్ : 27
మత వ్యాప్తి కోసం పన్నులు విధించరాదు
ఒక మతాన్ని వ్యాప్తి చేయడం కోసం బలవంతపు పన్నులు వసూలు చేయరాదు.
కానీ దేవాలయ సంస్థలు తాము అందించే సేవలకి భక్తుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు.

విద్యా సంస్కృతిక హక్కు
ఆర్టికల్ 29: అన్ని వర్గాలవారు ముఖ్యంగా మైనార్టీలు తమ భాష, లిపి, సంస్కృతిని సంరక్షించుకోవచ్చు.
ఆర్టికల్ 30: మైనార్టీ వర్గాలు భాషా లిపి సంస్కృతిని రక్షించుకోవడానికి విద్యాలయాలు స్థాపించుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో తెలుగు తప్పనిసరి చేశారు.
మైనార్టీలు : రాజ్యాంగంలో మైనార్టీ అనే పదం ఎక్కడా లేదు.
మైనార్టీలు రెండు రకాలు
1. మత పర మైనార్టీలు దేశంను ఒక యూనిట్‌గా తీసుకుంటే..
ఉదా: ముస్లింలు, క్రిష్టియన్లు.
2. భాష పర మైనార్టీలు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకుంటే .. ఉదా: తెలంగాణలో ఉర్దూ మాట్లాడేవారు.

విద్యాలయాల్లో మత బోధన చేయరాదు
(ఆర్టికల్ 28)

విద్యాలయాల్లో మత బోధన చేయకూడదు.
కొన్ని మత సంబంధ విద్యా సంస్థల్లో వారి మత అంశాలు బోధించుకోవచ్చు. కాని వాటిని పాటించాలని విద్యార్థులను బలవంతం చేయరాదు.
ఉదాహరణ: క్రైస్తవ మిషనరీ పాఠశాలలు, మదర్సాలు, ఘటికలు లాంటి విద్యాలయాలలో మత బోదన చేయవచ్చు.

ప్రశ్న: లౌకిక అనే లక్షణాన్ని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? (4)
1. 42 2. 24
3.44 4.25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News