Tuesday, April 30, 2024

మోడీజీ…. ఆ అవకాశం కల్పిస్తే… పాక్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా…

- Advertisement -
- Advertisement -

Indian struggling to marry pak girl to modi for help

ఛండీగఢ్: పాక్‌లో ఉన్న బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు వీసా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఓ యువకుడు విజ్ఞప్తి చేసిన సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. బస్తీ బవా ఖేల్ గ్రామంలోని వాల్మీకి కులానికి చెందిన కమల్ కల్యాణ్ అనే యువకుడు కారు డీలర్‌గా పని చేసేవాడు. కమల్ కల్యాణ్ తండ్రికి ఇద్దరు చెల్లెలు పాకిస్తాన్‌లోని లాహోర్, కాసూర్ ప్రాంతానికి చెందిన వారిని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయారు. భారత్‌తో పాక్ విడిపోయినప్పుడు కమల్ కల్యాణ్ మాత్రం భారత్‌కు తిరిగొచ్చాడు. ఆయన చెల్లెలు మాత్రం పాక్‌లో ఉండిపోయారు. 2015 వరకు పాక్‌లోని తన బంధువుల ఇళ్లలో శుభాకార్యాలకు వెళ్లి వస్తుండేవాడు. 2015 నుంచి పాకిస్థాన్ వెళ్లడానికి ప్రభుత్వం నిషేధం విధించడంతో తన బంధువులను కమల్ తండ్రి కలుసులేకపోయాడు. 2018లో తాజాగా కమల్ కల్యాణ్ తండ్రి చెల్లెలు మనవరాలి సుమైళతో కమల్‌కు ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ చేశారు. పెళ్లి కోసమని వాళ్లు భారత్ రావాటానికి తీవ్రంగా ప్రయతిస్తున్నప్పటికి వీసా మాత్రం దొరకడం లేదు.  దీంతో భారత ప్రభుత్వం వాళ్లకు వీసా ఇప్పిస్తే తాను పెళ్లి చేసుకొని, ఇంటి వాడిని అవుతానని ప్రధాని మోడీకి కమల్ లేఖ రాశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News