Monday, May 6, 2024

నగరాలకు వెళ్లకుండా మహబూబ్ నగర్ లో వైద్య సదుపాయం: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: భవిష్యత్‌లో జిల్లా వాసులు వైద్యం కోసం ఇతర నగరాలు వెళ్లకుండా మహబూబ్‌నగర్ దగ్గరలోని అత్యాధునిక వైద్య సదుపాయం కల్పిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 20 యూనిట్ల ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జిల్లా ఆస్పత్రిలో కేవలం 18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు ఉండేవారని, ఇప్పుడు సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News